Breaking News

రాహుల్‌ నివాసం వద్ద డీకేఎస్‌ మద్దతుదారుల నినాదాలు

Published on Wed, 05/17/2023 - 14:43

ఢిల్లీ: మూడు రోజుల చర్చల తర్వాత..  కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పేరును కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఖరారు చేసిందనే ప్రచారం ఊపందుకుంది. ఈలోపు సాయంత్రం ఏఐసీసీ ప్రెసిడెంట్‌ మల్లికార్జున ఖర్గే ఆ పేరును అధికారికంగా ప్రకటించడమే తరువాయి అంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఈ లోపు.. హస్తినలో ఇవాళ హాట్‌ హాట్‌ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 

సీఎం పదవిని ఆశించిన డీకే శివకుమార్‌ తన సోదరుడితో కలిసి కాంగ్రెస్‌ కీలక నేత రాహుల్‌ గాంధీతో భేటీ అవ్వగా.. ఆయన మద్దతుదారులు నివాసం బయట నిరసనకు దిగారు. డీకే శివకుమార్‌కే ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలంటూ ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు వాళ్లు.  దత్త పుత్రుడు కావాలా? అసలు పుత్రుడు కావాలా? అంటూ డీకేఎస్‌ను సీఎం చేయాలంటూ నినాదాలు చేశారు వాళ్లు. 

పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి రావడానికి డీకేఎస్‌ కారణమని, ఆయనకు కాకుండా సీఎం పోస్ట్‌ ఎవరికి ఇచ్చినా ఆ నిర్ణయం చారిత్రక తప్పిదమే అవుతుందని వ్యాఖ్యానించారు వాళ్లు. ఒకపక్క సీఎంగా సిద్ధరామయ్య పేరు దాదాపు ఖరారు కావడంతో బెంగళూరులోని ఆయన నివాసం బయట ఫొటోకు పాలాభిషేకం చేశారు మద్దతుదారులు. దీనికి ప్రతిగానే డీకేఎస్‌ అనుచరగణం ఇలా రాహుల్‌ నివాసం బయట గుమిగూడినట్లు తెలుస్తోంది. రాహుల్‌తో భేటీ అనంతరం డీకే సోదరులు నేరుగా ఖర్గే నివాసానికి వెళ్లారు.

ఇదీ చదవండి: జస్ట్‌ 16 ఓట్ల ఆధిక్యంతో నెగ్గిన బీజేపీ అభ్యర్థి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)