Breaking News

అగ్నిపథ్‌పై విపక్షాల విమర్శలు.. ప్రధాని మోదీ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Published on Fri, 07/26/2024 - 14:18

న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో సైనికుల నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిప్పికొట్టారు.  25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా లడఖ్‌లోని ద్రాస్ సెక్టార్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ..  విపక్షాలపై ధ్వజమెత్తారు.

భారతదేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశంపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని మోదీ మండిపడ్డారు. భారత సైన్యం ప్రారంభించిన కీలకమైన సంస్కరణలకు అగ్నిపథ్ పథకం ఒక ఉదాహరణ అని చెప్పారు.  ప్రపంచ దేశాల సైనికుల సగటు వయసు కంటే భారత సైనికుడి సగటు వయసు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. 

దీనిపై అనేక కమిటీలు చర్చించాయే కానీ, ఏ ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోలేదు. అగ్నిపథ్ స్కీం ద్వారా మేం ఈ సమస్యకు పరిష్కారం తీసుకువచ్చాం. ఈ పథకం ద్వారా భారత సైన్యంలో యువరక్తం పొంగిపొర్లుతుంది... అన్నివేళలా యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది.

భారత బలగాలకు సంబంధించిన పెన్షన్‌ సొమ్మును పొదుపు చేయడానికే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు విధుల్లో చేరిన ఉద్యోగులకు 30 ఏళ్ల తర్వాత పింఛన్‌ అనే ప్రశ్న తలెత్తుతుంది. కానీ మేమే ఈ అంశంపై ఎందుకు నిర్ణయం తీసుకున్నాం, అది తర్వాత వచ్చే ప్రభుత్వాలకే వదిలేయాలని ఆలోచించలేదు. ఎందుకంటే ఎందుకంటే రక్షణ దళాలు అంటే మాకు గౌరవం ఉంది, వారి నిర్ణయం పట్ల మాకు గౌరవం ఉంది.  మేం 'రాజనీతి' కోసం కాకుండా 'రాష్ట్రనీతి' కోసం పని చేస్తున్నాం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)