Breaking News

బీజేపీలో చేరికపై కమలనాథ్‌ యూటర్న్‌..

Published on Mon, 02/19/2024 - 11:10

బీజేపీలో చేరికపై కమలనాథ్‌ యూటర్న్‌ తీసుకున్నారు. సోమవారం రాహుల్‌ గాందీ, మల్లికార్జునతో కమల్‌ నాథ్‌ భేటీ అయ్యారు. అనంతరం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని వెల్లడించారు కమల్‌నాథ్‌.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు షాక్‌.. పార్టీ వీడనున్న సీనియర్‌ నేత కమల్‌నాథ్‌.. కొడుకుతోపాటు బీజేపీలోకి మాజీ సీఎం.. గత రెండు రోజులుగా వినిపిస్తున్న వార్తలివీ.. 

ఈటీవల జరిగిన మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం తర్వాత పార్టీ చీఫ్‌ పదవి నుంచి తనను తొలగించడంతో అధిష్టానంపై కోపం ఉన్న మాజీ సీఎం కమల్‌నాథ్‌ తన కుమారుడు నకుల్‌నాథ్‌తో కలిసి బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనికి తోడు రాష్ట్రం నుంచి రాజ్యసభకు అవకాశం ఇస్తారనుకుంటే కమల్‌నాథ్‌కు హస్తం మొండిచేయి చూపడంతో ఆయన మరింత అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. 

తాజాగా కమల్‌నాథ్‌ పార్టీ వీడటంపై క్లారిటీ వచ్చింది. సోమవారం రాహుల్‌ గాందీ, మల్లికార్జున కమల్‌ నాథ్‌తో భేటీ అయి బుజ్జగించారు. దీంతో  బీజేపీలో చేరికపై కమలనాథ్‌ యూటర్న్‌ తీసుకున్నారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని వెల్లడించారు.

అంతకముందే కమల్‌నాథ్‌ ఏ పార్టీలో చేరడం లేదని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర సింగ్‌ ఆదివారం సాయంత్రం వెల్లడించారు.  ప్రస్తుత మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జీతూ పట్వారి కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ‘'ఇది కమల్‌నాథ్‌పై జరిగిన కుట్ర. నేను ఆయనతో మాట్లాడాను. ఇవన్నీ వదంతులు మాత్రమేనని, తాను కాంగ్రెస్‌ వ్యక్తినని, కాంగ్రెస్‌ వ్యక్తిగా కొనసాగుతానని.. తన చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌ భావజాలాన్ని కొనసాగిస్తానని చెప్పారు. ఇది ఆయన సొంత ఆలోచనలు, ఆయనే ఇదంతా చెప్పారు’ అని వెల్లడించారు.

చదవండి: చండీగఢ్ మేయర్ రాజీనామా ఆసక్తికరంగా రాజకీయాలు

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)