Breaking News

‘జాగ్రత్త నీ జాతకం మొత్తం ఉంది’.. కోటంరెడ్డికి స్ట్రాంగ్‌ కౌంటర్‌

Published on Thu, 02/09/2023 - 11:49

సాక్షి, నెల్లూరు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటంరెడ్డి ఆరోపణల్లో వాస్తవాలు లేవని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 

కాగా, మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. ‘కోటంరెడ్డి చెప్పింది అబద్దమని శివారెడ్డి చెబుతున్నారు. శ్రీధర్‌రెడ్డి ఆరోపణల్లో వాస్తవాలు లేవు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. జరగని విషయాన్ని జరిగినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆడియో రికార్డులను ట్యాపింగ్‌ అని చెబుతున్నారు. జరిగింది ఫోన్ ట్రాప్ కాదు.. చంద్రబాబు ట్రాప్. శ్రీధర్‌ రెడ్డి అబద్ధాలకు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోంది. ట్యాపింగ్‌ ఆరోపణలు నిజమైతే కోర్టుకు ఎందుకు వెళ్లలేదు. తనకు అండగా నిలిచిన పార్టీకే కోటంరెడ్డి ద్రోహం చేశాడు. అందుకే కోటంరెడ్డికి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వాపును చూసి బలమనుకుని భ్రమపడుతున్నాడు. ప్రజలంతా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉన్నారు’ అని కామెంట్స్‌ చేశారు. 

ఈ సందర్బంగానే ఆదాల ప్రభాకర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రతీరోజు శ్రీధర్‌ రెడ్డి మీడియా సమావేశాల్లో పచ్చి డ్రామాలు వేస్తున్నారు. ఇది కరెక్ట్‌ కాదు. ఈరోజు వరకు నేను ఎలాంటి మచ్చ లేకుండా రాజకీయాలు చేశాను. ఈ మూడున్నర ఏళ్లలో నువ్వు ఎన్ని అరాచకాలు చేశావో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నీకు పార్టీ, కార్యకర్తలు అవసరం లేదు. డబ్బు మీదు నీకు ప్రేమ ఎక్కువ అందుకే ఎలాంటి పనిచేయడానికైనా నువ్వు వెనుకాడలేదు. శ్రీధర్‌ రెడ్డి జాతకం మొత్తం త్వరలో బయటకు వస్తుంది. కొన్ని రోజుల్లోనే ప్రజలకు నీ గురించి అన్ని విషయాలను చెబుతున్నారు. నువ్వు ప్రజలను, రియల్టర్లను, వ్యాపారులను ఎలా బెదిరించావో అందరకీ తెలుసు. ఇక​నైనా జాగ్రత్తగా ఉండు’ అని వార్నింగ్‌ ఇచ్చారు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)