Breaking News

బీఆర్‌ఎస్‌ కుట్రలో భాగమే వరంగల్‌ ఆరు ముక్కలు: కడియం శ్రీహరి

Published on Thu, 09/26/2024 - 13:41

సాక్షి, జనగామ: తెలంగాణలో అవినీతి, అక్రమాలకు మారుపేరు బీఆర్‌ఎస్‌ అంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అలాగే, వరంగల్‌ చరిత్రను కనుమరుగు చేసేందుకే జిల్లాను ఆరు ముక్కలు చేశారని చెప్పుకొచ్చారు. జిల్లాను ముక్కలు చేయవద్దు అన్నందుకే తనకు రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదని కామెంట్స్‌ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారాయి.

స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజాస్వామ్య వ్యవస్థను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కాలరాసింది. అవినీతి, అక్రమాలకు బీఆర్‌ఎస్‌ మారుపేరు. వరంగల్‌ చరిత్రను కనుమరుగు చేసేందుకు కేసీఆర్‌ కుట్ర పన్నారు. అందులో భాగంగానే జిల్లాను ఆరు ముక్కలు చేశారు. దీనిపై ప్రశ్నించినందుకే రెండో సారి నాకు మంత్రి పదవి ఇవ్వలేదు.

కేసీఆర్‌ కుటుంబ చేతిలో తెలంగాణ బంధీ అయ్యింది. బీఆర్‌ఎస్‌ నేతలు సిగ్గులేకుండా ఇప్పుడు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఏకంగా శాసనసభ పక్షాలను కలుపుకున్న చరిత్ర బీఆర్‌ఎస్‌ పార్టీది. ఇప్పట్లో తెలంగాణలో ఉప ఎన్నికలు రావు. ఒకవేళ వచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉంది. స్టేషన్‌ ఘనపూర్‌లో ఎన్నికలు వస్తే బీఆర్‌ఎస్‌కు డిపాజిట్‌ కూడా రాదు. కోర్టులు, ప్రజాస్వామ్యంపై మాకు గౌరవం ఉంది’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: మూసీ పరివాహక ప్రాంతాల్లో టెన్షన్‌‌.. అక్కడ భవనం కూల్చివేత


 

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు