Breaking News

నేను నోరు విప్పితే అంతే.. ఎమ్మెల్యే ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకోవాలి

Published on Tue, 07/11/2023 - 05:28

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఎమ్మెల్యే రాజయ్య నా కుటుంబం గురించి, నా తల్లి, నా బిడ్డ గురించి సభ్యత, సంస్కారం లేకుండా అడ్డగోలుగా మాట్లాడారు.. నేను నోరు విప్పితే ఆయన కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తీవ్రంగా స్పందించారు.  జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

తల్లి అనేది సత్యం.. తండ్రి అనేది అపోహ అంటూ నా తల్లిదండ్రులను ఉద్దేశిస్తూ రాజయ్య చేసిన వ్యాఖ్యలు సమాజంలో ఉన్న ప్రతి తల్లిని, కుటుంబ వ్యవస్థను అవమానించేలా ఉన్నాయని, ఇందుకు రాజయ్య ముక్కు నేలకు రాసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ’’అవును నాతల్లి బీసీ, తండ్రి ఎస్సీ, సుప్రీంకోర్టు తీర్పు, చట్టం ప్రకారం నేను ఎస్సీ, నా బిడ్డ ఎస్సీ. నాబిడ్డ మతాంతర వివాహం చేసుకుంటే ఆమెకు పుట్టే పిల్లలకు తండ్రి మతం, కులం వర్తిస్తుంది’ అని చెప్పారు.

1994కు ముందు ఎన్‌కౌంటర్లు జరగలేదా...
తనను ఎన్‌కౌంటర్ల సృష్టికర్త అంటూ రాజయ్య వ్యాఖ్యలు చేశారని, రాష్ట్రంలో 1994కు ముందు ఎన్‌కౌంటర్లు జరగలేదా అని కడియం ప్రశ్నించారు. అధిక ఎన్‌కౌంటర్లు 2004–14 మధ్యలో జరిగాయని, అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి నక్సలైట్లను చర్చలకు పిలిచిన విషయాన్ని గుర్తుకు చేశారు. 2004 నుంచి 2012 వరకు రాజయ్య కాంగ్రెస్‌లో ఉన్నాడని, ఆ సమయంలో జరిగిన ఎన్‌కౌంటర్లకు బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. 

వేల కోట్ల ఆస్తులు నిరూపిస్తే దళితులకు రాసిస్తా.. 
రాజయ్య ఆరోపిస్తున్న విధంగా వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని నిరూపిస్తే.. వాటిని నియోజకవర్గ దళితులకు రాసిస్తా అని కడియం అన్నారు.  నియోజకవర్గంలో పనులు ఇస్తానని, పదవులు ఇస్తానని ఏ ఒక్కరివద్ద డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే ఘన్‌పూర్‌ నియోజకవర్గాన్ని వదిలేసి పోటీనుంచి తప్పుకుంటానని సవాల్‌ చేశారు.

నియోజకవర్గంలో వందలాది మంది పేదలు పుస్తెలు, ఇండ్లు, వ్యవసాయ భూములు కుదువపెట్టి డబ్బులు ఇచ్చారని, సమయం వస్తే బాధితులతో కలిసి ప్రెస్‌మీట్‌ పెట్టి రాజయ్య బండారం బయటపెడతాని హెచ్చరించారు. నీ చేష్టలు, మాటలు అన్నీ పార్టీ అధిష్టానం చూస్తోందని.. త్వరలోనే శిశుపాలుడి వధ జరుగుతుందని కడియం వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ఎవ్వరికి టికెట్‌ ఇచ్చినా నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండాను ఎగురవేసేలా కృషి చేస్తానన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)