Breaking News

మేడిగడ్డ సందర్శన.. కాంగ్రెస్‌ మంత్రులకు కడియం కౌంటర్‌

Published on Fri, 12/29/2023 - 18:40

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ మంత్రుల వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కౌంటర్‌ ఇచ్చారు. అన్ని అనుమతులు తీసుకున్నాకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినట్లు తెలిపారు. అంచనాలు పెంచి కట్టారని కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నారని.. పవర్‌ జనరేట్‌ ప్రాజెక్టులు, సబ్‌ స్టేషన్‌లు, లిఫ్ట్‌లు ఏర్పాటు చేయడం వల్లే అంచనా పెరిగిందని పేర్కొన్నారు. మేడిగడ్డ వద్ద, 19, 20, 21 పిల్లర్లు కుంగడం దురదృష్టకరమని.. ఈ ప్రాజెక్టుపై పూర్తిస్థాయి విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ కూడా కోరుకుంటోందని తెలిపారు. 

జ్యూడిషియల్‌ ఎంక్వైరీ కచ్చితంగా చేయాలన్నారు కడియం. అయితే విచారణ జరగకముందే మంత్రులు తీర్పులు చెబుతున్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి చాలా విషయాల్లో అవగాహన ఉందని భావించానని..కానీ ఆయనే పూర్తిగా తెలుసుకోకుండా తీర్పునిస్తున్నారని మండిపడ్డారు. గతంలో తాను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు సీఎం హోదాలో కేసీఆర్‌తో కలిసి ప్రధాని వద్దకు వెళ్లి కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని అడిగిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీకి అడుగడుగునా విషం నింపుకుంది కాబట్టే హోదా ఇవ్వలేదని దుయ్యబట్టారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయా హోదా తీసుకురావాలని, ఇందుకు తాము కూడా మద్దతిస్తామని తెలిపారు.

కాళేశ్వరం సందర్శన కోసం వెళ్లిన మంత్రులు.. అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారని అన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయలేక ఆర్ధిక వనరులు సమకూర్చుకోలేక జనాన్ని మోసం చేయటానికి కొత్త డ్రామాలకు తెర లేపారని విమర్శించారు. శ్వేత పత్రాలు అంటూ కొంత కాలయాపన చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఇప్పుడు ప్రాజెక్టులో అవినీతి అంటూ కాలం గడుపుతుందని మండిపడ్డారు. రూ. 93 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.  తమ్మిడిహాట్టి దగ్గర కట్టింది కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రోజెక్ట్ మాత్రమేనని తెలిపారు.
చదవండి: కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణ చేస్తాం: ఉత్తమ్‌

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)