Breaking News

MP: కమల్‌ నాథ్‌ను తప్పించిన కాంగ్రెస్‌

Published on Sat, 12/16/2023 - 20:15

బోఫాల్‌: మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ పదవి నుంచి సీనియర్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం కమల్‌ నాథ్‌(77)ను తప్పించింది ఆ పార్టీ అధిష్టానం. కొత్త చీఫ్‌గా జీతూ పట్వారీ(50) పేరును ఏఐసీసీ ప్రెసిడెంట్‌ మల్లికార్జున ఖర్గే శనివారం సాయంత్రం ప్రకటించారు. జీతూ నియామకం తక్షణం అమలులోకి వస్తుందని, కమల్‌ నాథ్‌ ఇంతకాలం అందించిన సేవలు ప్రశంసనీయమని ఆయన తెలిపారాయన. 

ఇటీవల మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కమల్‌ నాథ్‌ రాజీనామా చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ, అది జరగలేదు. ఇప్పుడు ఆయన్ని తప్పించి ఆ బాధ్యతల్ని.. మాజీ మంత్రి అయిన జీతూ పట్వారీకి అప్పజెప్పారు.


రాహుల్‌ గాంధీతో జీతూ పట్వారీ (ఫైల్‌ ఫొటో)

జీతూ పట్వారీ తాజా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌లో కొత్త రక్తం ఎక్కించే క్రమంలోనే ఓడిపోయినా.. జీతూనే పార్టీ చీఫ్‌గా అధిష్టానం ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)