Breaking News

జార్ఖండ్‌ ఎన్నికలు: 32 సీట్లలో ‘లేడీస్‌ ఫస్ట్‌’

Published on Thu, 10/31/2024 - 13:27

రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు అంతకంతకూ ఆసక్తిరంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13, నవంబర్ 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ప్రధాన పోటీ బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి, జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని  ఇండియా కూటమి మధ్యనే ఉంది.

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోరులో ఈసారి మహిళలే  కీలకం కానున్నారు. ఓటర్ల జాబితా లెక్కలే ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. రాష్ట్రంలోని 32 అసెంబ్లీ స్థానాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ​​ఎక్కువగా ఉన్నారు. దీంతో అభ్యర్థుల గెలుపు ఓటముల్లో మహిళా ఓటర్ల పాత్ర కీలకంగా మారనుంది. ఈ 32 స్థానాల్లో మహిళలు నిర్ణయాత్మక పాత్ర పోషించే పరిస్థితి నెలకొంది. జార్ఖండ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 2.60 కోట్లు. వీరిలో 1.31 కోట్ల మంది పురుషులు, 1.29 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్న స్థానాలపై అన్ని పార్టీలు దృష్టిసారించాయి. మహిళల ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుత హేమంత్ సోరెన్ ప్రభుత్వం మహిళల కోసం ‘మయ్యా సమ్మాన్ యోజన’ను అందిస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రంలోని 50 లక్షల మందికి పైగా మహిళలకు నెలకు వెయ్యి రూపాయలు అందజేస్తున్నారు. మరోమారు తాము అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని నెలకు రూ.2500కు పెంచుతామని ఇటీవల సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు.

ఎన్డీఏలో మొత్తం 14 మంది మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీలో 12 మంది మహిళా అభ్యర్థులు ఉండగా ఏజేఎస్‌యూలో ఇద్దరు మహిళా అభ్యర్థులు టిక్కెట్లు దక్కించుకున్నారు. ఇండియా కూటమిలో మొత్తం 12 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: స్టీల్‌ ప్లాంట్‌లో పేలుడు.. 12 మంది మృతి
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)