Breaking News

Jharkhand: మంత్రి పదవుల ముసలం.. హస్తినలో ఎమ్మెల్యేలు బిజీ!

Published on Sun, 02/18/2024 - 13:52

న్యూఢిల్లీ: జార్ఖండ్‌ ప్రభుత్వంలో  మంత్రి పదవుల ముసలం పుట్టింది. చంపయ్‌ సోరేన్‌  నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంతో తమకు మంత్రి పదవులు  దక్కలేదని ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నారు. అక్కడితో ఆగకూండా ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కలడానికి శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. తాజాగా చంపయ్‌ సోరేన్‌ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో కాంగ్రెస్‌కు చెందిన ఆలంగీర్ ఆలం, రామేశ్వర్ ఓరాన్, బన్నా గుప్తా, బాదల్ పత్రలేఖ్‌లకు మళ్లీ మంత్రి పదవులు ఇవ్వాలన్న కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయంపై ఎమ్మెల్యేలు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

‘మేము కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలను కలవడానికి ఢిల్లీ వచ్చాం. ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ. వేణుగోపాల్‌, పార్టీ చీఫ్‌  మల్లికార్జున ఖార్గేతో మా సమస్యలు చెబుతాం’ అని ఎమ్మెల్యే రాజేష్‌ కచాప్ తెలిపారు. ఢిల్లీ బయలుదేరే ముందు మరో ఎమ్మెల్యే కుమార్‌  జైమంగల్‌ అలియాస్‌ అనూప్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్‌లోకి తీసుకున్న నలుగురు మంత్రుల స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్నారు.

అంత కంటే ముందు.. మంత్రి పదవులపై  అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు జేఎంఎం పార్టీకి చెందిన కొత్త మంత్రి బసంత్‌ సొరెన్‌ను కలిసి తమ అసంతృప్తి తెలియజేశారు. అయితే సమావేశం అనంతరం ఆయన మీడియాతో మట్లాడుతూ... ‘రెండు పార్టీల మధ్య ఎటువంటి అనిశ్చితి లేదు. తామంతా ఐకమత్యంగా ఉన్నాం’ అని చెప్పారు. మరోవైపు.. అసంతృప్త ఎమ్మెల్యేల కంటే ముందే సీఎం చంపయ్‌ సొరెన్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ రాజేశ్‌ ఠాకూర్‌ ఢిల్లీలో చేరుకున్నారు. వీరు కూడా కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు.

కేబినెట్‌లో నలుగురు మంత్రుల స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వకపోతే.. ఫిబ్రవరి 23న జరిగే అసెంబ్లీ సమావేశాలకు అసంతృప్త ఎమ్మెల్యేలు హాజరుకాకుండా జైపూర్‌పు వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీఎం చంపయ్‌ సొరెన్‌  జనవరి 16 కొత్త కెబినెట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 2న హేమంత్‌ సొరెన్‌ను భూకుంభకోణం కేసులో ఈడీ అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో చంపయ్‌ సొరెన్ జార్ఖండ్‌కు కొత్త సీఎం బాధ్యతలు చేపట్టారు. జేఎంఎం-29, కాంగ్రెస్‌-17, ఆర్జేడీ-1 స్థానంతో జార్ఖండ్‌లో జేఎంఎం​ సంకీర్ణం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)