Breaking News

కాంగ్రెస్‌లో ట్విస్ట్‌ : సీనియారిటీకి గుర్తింపు లేకపోతే ఎలా.. జీవన్‌రెడ్డి గుస్సా

Published on Tue, 04/15/2025 - 13:38

సాక్షి, జగిత్యాల: తెలంగాణలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియారిటీకి తగిన గుర్తింపు పార్టీలో లేనప్పుడు తప్పకుండా  అసంతృప్తి ఉంటుంది అంటూ కామెంట్స్‌ చేశారు. దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ నియంతృత్వ, అప్రజాస్వామిక విధానాలపై పోరాడిన ఏకైక ఎమ్మెల్సీ తానే అని జీవన్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీలో వీహెచ్ తప్ప ప్రస్తుతం నాకంటే అనుభవజ్ఞుడైన నాయకుడు ఎవరున్నారు?. జానారెడ్డి కూడా నాకంటే పార్టీ పరంగా నాలుగేళ్లు జూనియరే. దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ నియంతృత్వ, అప్రజాస్వామిక విధానాలపై పోరాడిన ఏకైక ఎమ్మెల్సీని నేనే. శాసనసభ, శాసన మండలిలో.. కాంగ్రెస్ పార్టీ కోసం రేవంత్ రెడ్డి ఎంత పోరాటమైతే చేశారో అంతకు మించి పోరాటం నేనూ చేశాను.

సీనియారిటీకి తగ్గ గుర్తింపు పార్టీలో లేనప్పుడు తప్పకుండా నాకు అసంతృప్తి ఉంటుంది. అది కావాలని కోరుకోవడంలో తప్పేముంది?. సీనియర్ నాయకుడైన ప్రేమ్ సాగర్ రావు అయినా, రాజగోపాల్ రెడ్డి అయినా మంత్రి పదవులు కావాలని కోరుకోవడంలో తప్పేముంది అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో కొత్త చర్చకు దారి తీసినట్టు తెలుస్తోంది. 

కాంగ్రెస్ పార్టీలో సీనియారిటీకి తగ్గ గుర్తింపు లేదు: జీవన్ రెడ్డి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)