Breaking News

పెద్దారెడ్డితో ఉంటారా.. వాళ్ల సంగతి చూస్తా: జేసీ వార్నింగ్‌

Published on Sun, 06/29/2025 - 12:37

సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం రాజ్యమేలుతోంది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్‌ చేసి టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి వార్నింగ్‌ ఇవ్వడం తీవ్ర కలకలం సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట ఎవరూ తిరగొద్దు. పెద్దారెడ్డికి మద్దతుగా ఉండే వారిని గుర్తిస్తాం.. ఫోటోలు తీస్తున్నాం. పెద్దారెడ్డిని మద్దతు ఇచ్చే వారిని రప్పా..రప్పా.. అని నరికేస్తాం’ అని కామెంట్స్‌ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై ప్రజలు, వైఎస్సార్‌సీపీ నేతలు మండిపతున్నారు.

ఇదిలా ఉండగా.. ఆదివారం ఉదయం నుంచి తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏడాది తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి వెళ్లారు. అయితే, పెద్దారెడ్డి రాకపై సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం ఉదయం తాడిపత్రిలోని తన నివాసంలో బలవంతంగా అరెస్ట్‌ చేశారు. తాడిపత్రిలో ఉండరాదంటూ ఆంక్షలు విధించారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పెద్దారెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేశారు. అనంతరం పెద్దారెడ్డిని అనంతపురం తరలించారు.

ఈ సందర్బంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ..‘పోలీసులు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. నేను తాడిపత్రి వెళ్లొచ్చని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నా ఇంటికి నేను వెళితే పోలీసులకు ఇబ్బంది ఏంటి?. పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా?.తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరిని ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటాను. జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పించారు. మరోవైపు.. టీడీపీ జేసీ, పోలీసుల తీరుపై వైఎస్సార్‌సీపీ నేతలను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మాజీ మంత్రి శైలజానాథ్ కామెంట్స్..
పోలీసుల తీరును ఖండిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. తాడిపత్రి వెళ్లిన పెద్దారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు?. పెద్దారెడ్డిపై పోలీసుల ఆంక్షలు ఎందుకు?. ఓ మాజీ ఎమ్మెల్యేని లాక్కొని వస్తారా?. ఇప్పటికైనా పోలీసులు చట్టాన్ని కాపాడాలి. పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించాలి. ఎస్పీ జగదీష్ బాధ్యతగా ప్రవర్తించాలి.. ఏకపక్షంగా వ్యవహరించవద్దు.

మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కామెంట్స్..
ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసిన రాక్షస ప్రభుత్వం మెడలు వంచి హామీలను నెరవేర్చేంతవరకు పోరాడతాం. బాండ్లు ఇచ్చి మరీ హామీ ఇచ్చారు.. ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. ప్రజలను మోసం చేసిన చంద్రబాబుపై ఫిర్యాదు చేస్తాం. పోలీసులు కేసు నమోదు చేస్తారా?. రాజ్యాంగ విరుద్ధంగా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్‌సీపీ నాయకులను పీడిస్తున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో మైనింగ్ వ్యాపారులను బెదిరించి , కేసులు , జరిమానాలు వేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)