Breaking News

నిర్వాసితునికి జనసేన ఎమ్మెల్యే బెదిరింపులు

Published on Fri, 03/28/2025 - 09:38

మునగపాక: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ­కుమార్‌ సహనం కోల్పోయారు. సందర్భాన్ని బట్టి ఓర్పు, సహనంతో నియోజకవర్గ ప్రజలను సముదాయించాల్సిన ఆయన విరుచుకుపడ్డారు. భూసేకరణలో టీడీఆర్‌ బాండ్లు వద్దు.. నగదు చెల్లించాలని ఓ బాధితుడు కోరడమే ఆయ­న ఆగ్రహానికి కారణం. జిల్లాలోని మునగపాక జనసేన కార్యాలయం ఆవరణలో గురువారం పూడిమడక రోడ్డు విస్తరణ బాధితులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా  పలువురు నిర్వాసితులు టీడీఆర్‌ బాండ్లు ఇవ్వకుండా పరిహారం కింద నగదు అకౌంట్‌లో జమచేయాలని కోరారు. తిమ్మరాజుపేటకు చెంది­న తనకాల జగ్గారావు మాట్లాడుతూ.. తాను టీడీఆర్‌ బాండ్ల కోసం అనకాపల్లిలో వాకబు చేశానని.. ఈ బాండ్లు అమ్ముకోవడం కష్టతరమని చెప్పారని.. ఇలా అయితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు. పరిహారాన్ని నేరుగా నగదు రూపంలో అందించాలని కోరారు. ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌ జోక్యం చేసుకుని.. టీడీఆర్‌ బాండ్లను ఎక్కడైనా అమ్ముకోవచ్చని, అనకాపల్లిలో తప్ప ఇతర ప్రాంతాల్లో అమ్ముకోలేమని అనడం సరికాదంటూ బెదిరింపు ధోరణలో చెప్పారు.

దీంతో.. ఇద్దరి మధ్య మాటామాటా పెరుగుతుండడంతో ఎమ్మెల్యే సహనం నశించి.. ‘ఉండు.. నువ్వుండు.. ఆ­గమంటున్నానా.. కౌంటర్‌ ఇవ్వడం కాదు. నేను తల­చుకుంటే నీపై కేసు పెట్టలేనా?’ అని మండిపడ్డారు. నిర్వాసితుల్లో అనుమానాలు రేకెత్తించేలా ప్రవర్తించడం సరికాదంటూ హెచ్చరించారు. విస్తరణలో భూములు, ఇళ్లు కోల్పోయే బాధితులకు మెరుగైన పరిహారం అందజేస్తామన్నారు. వీఎంఆర్‌డీఏ ఎక్కడైనా భూములను సేకరించేటప్పుడు టీడీఆర్‌ బాండ్లు ఇస్తుందని.. ఇక్కడ కూడా ఇస్తారేమోనని విజయ్‌ అన్నారు. తాను ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి బాధితులకు నగదు రూపంలో పరిహారం అందించేలా చూస్తానని హామీ ఇచ్చారు.   

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)