Breaking News

మేం ‘పిఠాపురం’ తాలుకా.. మమ్మల్ని ఎవడ్రా ఆపేది!

Published on Fri, 03/14/2025 - 14:48

సాక్షి, కాకినాడ: జనసేన (Janasena) పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఒకవైపు యువ కార్యకర్తలు రోడ్లపై బైకులతో ప్రమాదకరమైన స్టంట్లతో వాహనదారుల్ని హడాలెత్తించగా.. ఇంకోవైపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించి మరీ వాహనదారులతో వాగ్వాదానికి దిగారు మరికొందరు.

పిఠాపురం శివారు ప్రాంతమైన చిత్రాడలో ‘జయకేతనం’(JSP JayaKethanam Sabha) పేరిట సభ నిర్వహిస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నియోజకవర్గం కావడంతో ఆ పార్టీ శ్రేణులు అతి చేష్టలకు దిగాయి. ‘‘పిఠాపురం డిప్యూటీ సీఎం తాలుకా.. మమ్మల్ని ఎవడ్రా ఆపేది?’’ అంటూ నినాదాలు చేస్తూ.. దారినపోయేవాళ్లను దుర్భాషలాడుతున్నారు.

ఈ క్రమంలో.. జనసేన స్టికర్లు, జెండాలతో ఉన్న బైకులు, కార్లతో రోడ్లపై హల్‌ చల్‌ చేశాయి. కత్తిపూడి-కాకినాడ 216 జాతీయ రహదారిపై జనసైనిక్స్‌ బైక్‌లతో ప్రమాదకర ఫీట్లు చేస్తూ సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తున్నారు. దీంతో ఆ దారి గుండా వెళ్లే పలువురు వాహనదారులు హడలెత్తిపోతున్నారు. ఇంకోవైపు.. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ జనసేన నేతలు సామాన్యులకు చుక్కలు చూపించారు.

ఈ క్రమంలో చిత్రాడ వద్ద బైక్‌ మీద వెళ్తున్న ఓ వ్యక్తికి.. జనసేన నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ట్రాఫిక్‌ క్లియర్‌ చేయాలని కోరాడతను. ఈలోపు వెనక నుంచి జెండాతో వచ్చిన ఓ వ్యక్తి అతన్ని చితకబాదాడు. సదరు వ్యక్తిని బూతులు తిట్టాడు. ఆ వీడియోలు సైతం వైరల్‌ అవుతున్నాయి. అయితే పిఠాపురంలో ఎర్ర టవల్‌ బ్యాచ్‌ ఇంత చేస్తున్నా.. అక్కడి పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోవడం గమనార్హం

కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన గూండాల అరాచకం

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)