Breaking News

వలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్‌!

Published on Sun, 08/13/2023 - 05:35

సాక్షి, విశాఖపట్నం: వలంటీర్లపై కత్తి కట్టిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ మరోసారి నోరు పారేసుకున్నారు. ఈసారి వలంటీర్లను దండుపాళ్యం బ్యాచ్‌తో పోల్చారు. ఇటీవల ఆయన మహిళల కిడ్నాప్‌లకు సహకరించే సంఘ విద్రోహశక్తులంటూ అభివర్ణించిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లు ఆగ్రహోదగ్రులయ్యారు. రోడ్లెక్కి నిరసన తెలియజేశారు. పవన్‌ దిష్టి»ొమ్మలను దహనం చేసి ఆయన వైఖరిని దుమ్మెత్తి పోశారు. ఊహించని ఈ పరిణామానికి దిగివచ్చిన పవన్‌.. తాను వలంటీర్లందరినీ అలా అనలేదని, కొందరిని ఉద్దేశించే అలా అన్నానని ఆ తర్వాత వివరణ ఇచ్చుకున్నారు.

పవన్‌ గత వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లారకముందే తాజాగా మరోసారి వలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశా­రు. గత నెలలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాతనగర్‌లో బంగారం కోసం ఓ వృద్ధురాలిని వెంక­టేష్‌ అనే వ్యక్తి హత్య చేశాడు. గతంలో ఇతను వలంటీర్‌గా పని చేస్తున్నప్పుడు ఫిర్యా­దులు రావడంతో అధికారులు తొలగించారు. ఇది వృద్ధురాలి హత్యకు ముందే జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖలో ఉన్న పవన్‌ శనివారం వరలక్ష్మి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అంతటితో ఆగకుండా అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘వలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్‌లా తయారయ్యారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నవరత్నాల కోసం నియమించిన వలంటరీ వ్యవస్థ ఈ రోజు ప్రజల ప్రాణాలు తీస్తోంది. వీరు అసాంఘిక శక్తుల్లా మారి నేరాలకు తెగబడుతున్నారు. పోలీస్‌ వెరిఫికేషన్‌ లేకుండా వలంటీరు ఉద్యోగాలిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.
  
జనసేన అద్భుతాలు చేయదు.. 

జనసేన అధికారంలోకి వస్తే అద్భుతాలు చేస్తుం­దని తాను చెప్పడం లేదని, వ్యవస్థలను బలోపేతం చేసి, శాంతిభద్రతలను కాపాడ­తా­మని పవన్‌ చెప్పారు. విశాఖ ఎంపీ  కుటుం­­బాన్ని రౌడీషీటర్లు కిడ్నాప్‌ చేస్తే.. అదే ఎంపీ వారినే వెనకేసుకొస్తున్నారని పేర్కొ­న్నా­రు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తానన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)