Breaking News

ఎమ్మెల్యే పెన్షన్‌ కోసం ధన్‌ఖడ్‌ దరఖాస్తు.. ఎంత వస్తుందంటే?

Published on Sun, 08/31/2025 - 07:26

జైపూర్‌: రాజస్థాన్‌ మాజీ ఎమ్మెల్యే అయిన తనకు పింఛనును పునరుద్ధరించాలని మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ దరఖాస్తు చేసుకున్నారు. కిషన్‌గఢ్‌ నియోజకవర్గం నుంచి 1993–1998 కాలంలో కాంగ్రెస్‌ శాసనసభ్యునిగా ఆయన కొనసాగారు. 2019 జూలై వరకు మాజీ ఎమ్మెల్యే పింఛను కూడా అందుకున్నారు. పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా నియమితులవడంతో ఆ పింఛను నిలిచిపోయింది. అనంతరం ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. 2022 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్న ధన్‌ఖడ్‌ అనారోగ్య కారణాలతో జూలై 21వ తేదీన రాజీనామా చేయడం తెల్సిందే.

అయితే, నిలిచిపోయిన మాజీ ఎమ్మెల్యే పింఛనును పునరుద్ధరించాలని రాజస్థాన్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌కు తాజాగా విజ్ఞాపన పంపారని అధికార వర్గాలు తెలిపాయి. ఉపరాష్ట్రపతి పదవికి చేసిన రాజీనామాను ఆమోదించినప్పటికీ నుంచి ఆయనకు మాజీ ఎమ్మెల్యే హోదాలో పింఛను అందించే ప్రక్రియను ప్రారంభించామని వివరించాయి. రాజస్థాన్‌లో ఒక దఫా ఎమ్మెల్యేగా పనిచేసిన వారికి నెలకు రూ.35 వేల చొప్పున పెన్షన్‌ అందిస్తారు. అదనంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన పర్యాయాలు, వయస్సును బట్టి పింఛను మారుతూంటుంది. 70 ఏళ్లు పైబడిన వారికి పింఛనులో 20 శాతం పెంపుదల ఉంటుంది.

ప్రస్తుతం ధన్‌ఖడ్‌ వయస్సు 74 ఏళ్లు అయినందుకు మాజీ ఎమ్మెల్యే హోదాలో పింఛను నెలకు రూ.42 వేల చొప్పున అందుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు, మాజీ ఉపరాష్ట్రపతి హోదాలో నెలకు రూ.2 లక్షల వరకు, మాజీ ఎంపీగా నెలకు రూ.31 వేల పింఛను అందుకునేందుకు ఆయన అర్హులని అధికారులు తెలిపారు. 1980ల్లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ధన్‌ఖడ్‌ 1990ల్లో లోక్‌సభకు ఎన్నికై కేంద్ర మంత్రిగా పనిచేశారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)