Breaking News

లోకేష్‌ను కలిసిన జగన్‌పై దాడి కేసు నిందితుడు

Published on Sat, 07/13/2024 - 14:57

విజయవాడ, సాక్షి: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో  ఏ1 నిందితుడు వేముల సతీష్‌, మంత్రి నారా లోకేష్‌ను కలిశాడు. శనివారం ఉదయం లోకేష్‌ నిర్వహించే ప్రజాదర్బాకు వెళ్లి.. ఆయనతో ఫొటో దిగాడు. 

వైఎస్‌ జగన్‌ హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సతీష్‌కు టీడీపీతో లింకులు ఉన్నాయంటూ వైఎస్సార్‌సీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. అయితే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచాక.. సతీష్‌ లోకేష్‌ను కలిసేందుకు యత్నించాడు. అయితే ఎందుకనో  అది కుదరలేదు. తాజాగా ఓ టీడీపీ నేత సహకారంతోనే ఈ అపాయింట్‌మెంట్‌ దక్కినట్లు తెలుస్తోంది. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఏప్రిల్‌ 13వ తేదీ రాత్రి విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుండగా నాటి సీఎం జగన్‌పై దాడి జరిగింది. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ పక్కకు తిరగడంతో అదృష్టతవశాత్తూ ఆయన కంటికి పైన భాగంలో మాత్రమే గాయమైంది.  

ఈ కేసులో ఏప్రిల్‌ 18వ తేదీన వేముల సతీష్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. నెల్లూరు జైలుకు తరలించారు. అయితే ఇందులో పొలిటికల్‌ కాన్‌స్పిరసీ (రాజకీయ కుట్ర) ఉందని పోలీసులు సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు జగన్‌ను హత్య చేయాలనే కుట్రతోనే వేముల సతీష్‌ పదునైన రాయితో దాడి చేసినట్లు రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఆ తర్వాత మే 28వ తేదీన విజయవాడ కోర్టు కండిషనల్‌ బెయిల్‌  ఇవ్వడంతో సతీష్‌ బయటకు వచ్చాడు. ఆ తర్వాత అతనికి పలువురు టీడీపీ నేతలు మద్దతుగా నిలవడం విశేషం.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)