Breaking News

దోచుకునేందుకు కష్టపడుతున్నారా?

Published on Mon, 04/08/2024 - 01:31

సాక్షి, హైదరాబాద్‌: రోజుకు 18 గంటలు కష్టపడు తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెబుతున్నా రని, దోచుకోవడానికి కష్టపడుతున్నారా? అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. వందరో జుల్లో సంపద అంతా దోచుకున్నారని, రాష్ట్రం నుంచి ఢిల్లీకి సంచులు మోస్తున్నారని ఆరోపించారు. కరువుతో రైతులు బాధపడుతున్నా..తుక్కుగూడ సభలో ఒక్క కాంగ్రెస్‌ నాయకుడు సైతం రైతుల గురించి మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్‌ 9నే  ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసగించారన్నారు.

ఇప్పు డు దేశ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్‌ నా యకులు శ్రీకారం చుట్టారని, 2014 కంటే ముందు అరాచకాలు మళ్లీ రాష్ట్రంలో మొదలయ్యా యని ఆరోపించారు. కేసీఆర్‌ ప్రభుత్వం అభివృద్ధిపైనే దృష్టి పెట్టిందని, కేసుల గురించి ఎన్నడూ మాట్లాడ లేదని, మేము రైతుల గురించి మాట్లాడుతుంటే,  కాంగ్రెస్‌వారు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లా డుతున్నారని చెప్పారు. రైతుగోడు పట్టించుకోకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఐపీఎల్‌ మ్యాచ్‌ చూసేందుకు వెళ్లాడన్నారు.

ఓ వైపు పార్టీ మారిన వారిని పక్కన కూర్చోబెట్టుకొని, మరోవైపు పార్టీ మారిన వారిని డిస్‌ క్వాలిఫై చేయాలని చట్టం తెస్తామని మాట్లాడుతుంటే.. నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూసి బాధపడి కేసీఆర్‌ సూచనలు ఇస్తుంటే..అవి పట్టించుకోకుండా కాంగ్రెస్‌ నాయకులు కేసీఆర్‌పై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  గతంలో ఏ నిబంధనలు లేకుండా కృష్ణా జలాలను నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు సాగునీటికి విడుదల చేసి రైతులను ఆదుకున్నామని గుర్తు చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, వి.నరసింహారెడ్డి పాల్గొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)