Breaking News

సుగాలి ప్రీతి కేసును వాడుకుని పవన్‌ రాజకీయంగా బాగుపడ్డారు : జడ శ్రావణ్‌కుమార్‌

Published on Mon, 03/03/2025 - 18:48

సాక్షి,విజయవాడ: సుగాలి ప్రీతి కేసును వాడుకుని రాజకీయంగా బాగుపడ్డారని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌పై జై భీమ్ రావు భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ ఫైరయ్యారు. సుగాలి ప్రీతి కుటుంబ సభ్యుల మనోవేదనపై న్యూ హోప్ ఫౌండేషన్ పాటను రూపొందించింది. ఆ పాట పోస్టర్‌ను జడ శ్రావణ్ కుమార్ ఆవిష్కరించారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  పవన్‌కు నిబద్ధత,నిలకడలేదు. రాజకీయాల కోసమే సుగాలిప్రీతి కేసును వాడుకున్నారు. సుగాలిప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామన్నాడు.. ఏమైంది?. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. వైఎస్‌ జగన్‌ హయాంలో ఐదెకరాల పొలం కూడా ఇచ్చారు. సీబీఐ విచారణకు జగన్‌ ప్రభుత్వం ఆదేశించింది.

పవన్ సుగాలి ప్రీతి గురించి ఒక వెయ్యి వీడియోల్లోనైనా మాట్లాడారు. సినిమాలో డైలాగ్ లు మర్చిపోయినట్లు .. సుగాలి ప్రీతి కేసును పవన్ మర్చిపోయినట్లున్నారు. సుగాలి ప్రీతికి న్యాయం కోసం పోరాడింది నేను. నన్ను తప్పుపట్టే విధంగా జనసేన కార్యకర్తలు సీన్ క్రియేట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన కార్యకర్తలు కేసులో ఎంటరయ్యారు. సుగాలి ప్రీతి కేసును వాడుకుని పవన్ రాజకీయంగా బాగుపడ్డాడు.

పవన్‌ను తిట్టిన వారిని అరెస్టులు చేయించారు. పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలపై స్పందించేందుకు సిద్ధంగా లేడు. తాను హామీ ఇచ్చిన సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయలేకపోయారు. పవన్‌కు నిబద్ధత..నిలకడ లేదు.

సుగాలి ప్రీతి కుటుంబం పవన్‌పై నమ్మకం ఇంకా ఎన్నాళ్లు పెట్టుకుంటారో వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా. సుగాలి ప్రీతి కేసును రాజకీయాల కోసం పవన్ వాడుకున్నాడు. పవన్‌ను నమ్ముకుంటే  2029లో మళ్లీ సుగాలి ప్రీతి హత్యకేసు ప్రచారాస్త్రంగా మారండం ఖాయమని’మండిపడ్డారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)