Breaking News

మీనాక్షినాయుడు చెవిలో ‘పువ్వు’ ! 

Published on Thu, 03/28/2024 - 04:34

సాక్షి ప్రతినిధి కర్నూలు: ఆదోని అసెంబ్లీ సీటుపై టీడీపీ, బీజేపీ బేరసారాలు ఫలించలేదు. రూ.3 కోట్లు ఇస్తే ఆదోని సీటు వదులుకుంటామని బీజేపీ చేసిన ప్రతిపాదనకు టీడీపీ నేతలు అంగీకరించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఆదోని నుంచి బీజేపీనే పోటీ చే­యాల్సిన అనివార్య పరిస్థితి తలెత్తింది. దీంతో ఆ పార్టీ పార్థసారథిని అభ్యర్థిగా ప్రకటించింది. వాస్తవా­ని­కి 15 రోజుల ముందే ఆదోని స్థానం బీ­జేపీ ఖాతా­లోకి చేరిందనే విషయం మీనాక్షినాయు­డు­కు తెలుసు. దీంతో ఆయన అనుచరులు టీడీపీ ఫ్లెక్సీలు తొలగించారు.

ఈ క్రమంలో బీజేపీకీ అభ్యర్థి దొరకకపోవడంతో ఆ పార్టీ నేతలు మీనాక్షి నాయు­డు మేనల్లుడు మారుతి నాయుడుకు ఫోన్‌ చేసి రూ.3 కోట్లు ఇస్తే ఆదోని సీటు వదులుకుని, ఆలూరు కావాలనే ప్రతిపాదనను పార్టీ అధిష్టానం ముందు ఉంచుతామని ఆఫర్‌ ఇచ్చారు. అయితే అంత డబ్బులు ఇవ్వలేమని మీనాక్షినాయుడు చెప్పడంతో బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది.   

మీనాక్షినాయుడు రాజకీయ భవితవ్యం ఎటు? 
కర్నూలు జిల్లా రాజకీయాల్లో మీనాక్షినాయుడు సీనియర్‌ నాయకుడు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. ఆదోని నుంచి మూడు దఫాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994, 1999­, 2009లో వైఎస్సార్‌ ప్రభంజనంలో­నూ ఆదోనిలో ఆయన విజయం సాధించారు. 1999లో కోట్ల సూర్య­ప్రకాశ్‌రెడ్డిపైనా గెలుపొందా­రు. టీడీపీ మిన­హా ఇత­ర పార్టీల్లోకి వెళ్లాలనే ఆలో­చన కూడా  చేయలేదు. టీడీపీని అంటిపెట్టుకుని ఆదోనిలో పార్టీ ఉన్న­తికి తోడ్పడ్డారు.

చివరిసారిగా ఈ ఎన్నికల్లో పోటీ చేయా­లని లేదా తన తనయు­డిని బరిలో నిలపాలని ఆయ­న అభిలషించారు. అలాంటి వ్యక్తిని కాదని పోటీ చేసేందుకు శక్తి లేక రూ.3 కోట్లకు సీటు వదలుకునేందుకు సిద్ధమైన పార్టీకి టీడీపీ అసెంబ్లీ సీటు ఇవ్వ­డాన్ని మీనాక్షినాయుడు జీర్ణించుకోలేకపోతున్నారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఆయనకు టీడీపీ గౌరవం ఇవ్వలేనప్పుడు ఆయన పార్టీలో ఎందుకు కొనసాగాలనే చర్చ కూడా నడుస్తోంది. 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)