Breaking News

IRR Case: నారాయణకు సీఐడీ నోటీసులు

Published on Mon, 10/02/2023 - 10:46

సాక్షి, కృష్ణా: ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ స్కామ్‌ కేసులో.. మాజీ మంత్రి, టీడీపీ నేత పొంగూరు నారాయణకు ఝలక్‌ తగిలింది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగానే..  విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. తాజాగా యానకు ఏపీ సీఐడీ నోటీసులు పంపింది. అక్టోబర్‌ 4వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది దర్యాప్తు సంస్థ. 

అమరావతి ఇన్నర్‌రింగ్‌ రోడ్డు స్కామ్‌లో ఏ2గా ఉన్న నారాయణ.. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ మీద బయట ఉన్నారు. తాజాగా ఈ కేసులో సీఐడీ దూకుడు పెంచడంతో.. ఆయన అరెస్టుకి భయపడి ముందస్తు బెయిల్‌ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. ఈలోపే ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు ఈ స్కామ్‌లో కీలక పాత్ర ఉందని నిర్ధారించుకుంది ఏపీ సీఐడీ. ఈ మేరకు కోర్టు ఆదేశాల ప్రకారం.. ఆయనకు నోటీసులు సైతం జారీ చేసింది. 

అక్టోబర్‌ 4వ తేదీన నారా లోకేష్‌ను తమ ఎదుట హాజరు కావాలని స్వయంగా ఢిల్లీ వెళ్లి మరీ నోటీసులు ఇచ్చింది ఏపీ సీఐడీ. ఇప్పుడు అదే తేదీన నారాయణను సైతం విచారణ చేపడుతుండడం గమనార్హం. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు స్కామ్‌ కేసులో.. ఈ ఇద్దరినీ కలిపి విచారించే అవకాశం కనిపిస్తోంది. 

చంద్రబాబు హయాంలోఅమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో అక్రమాలు జరిగాయంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ పేరిట జరిగిన భారీ అవినీతి దర్యాప్తులో వెలుగు చూసింది. ఏ-1గా చంద్రబాబు నాయుడు పేరును, ఏ-2గా మాజీ మంత్రి నారాయణ పేరును ఈ కేసులో చేర్చింది ఏపీ సీఐడీ. ఇప్పటికే చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా అరెస్ట్‌ అయ్యారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)