నువ్వెంత.. నీ స్థాయెంత

Published on Thu, 07/30/2026 - 13:50

కృష్ణాజిల్లా: టీడీపీలో అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలు బట్టబయలయ్యాయి. కృష్ణాజిల్లా ఉయ్యూరుపై ఆధిపత్యం కోసం తమ్ముళ్లు తన్నుకునే వరకూ వెళ్లారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ ఎదుటే ఒకరిపై ఒకరు వాదులాటకు దిగి దుర్భాషలాడుకున్నారు. నువ్వెంత...నీ స్థాయెంత అంటూ తోపులాటకు దిగారు. మంగళవారం రాత్రి టీడీపీ చేపట్టిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం వేదికగా తమ్ముళ్ల మధ్య పోరు నెలకొంది. 

ఉయ్యూరు టీడీపీలో గత కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. అధికారం, కాంట్రాక్టులు, ఆదాయ వనరుల అజెండాగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి తమ్ముళ్ల మధ్య అంతర్గత యుద్ధం జరుగుతోంది. పార్టీ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. కార్యక్రమాలు కూడా ఒంటెత్తు పోకడలుగా సాగుతుండటంతో శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది. మున్సిపాలిటీ వేదికగా సాగుతున్న ఈ తంతు ఇంటింటికీ తెలుగుదేశంలో బహిర్గతమైంది. కాపుల రామాలయం సెంటరులో ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ సమక్షంలోనే పార్టీ నాయకులు వంగవీటి శ్రీనివాసప్రసాద్, కూనపరెడ్డి వాసు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

ఈ క్రమంలో ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో దూషణలకు దిగి తోపులాట వరకూ వెళ్లారు. అధికారం, పదవులు, కాంట్రాక్టులు అన్నీ ఒకరిద్దరికే ఎలా కట్టబెడతారంటూ వంగవీటి ఆరోపించారు. ఆరోపణలపై వాసు అదే స్థాయిలో స్పందించి పార్టీలో కష్టపడ్డ వారికే ప్రాధాన్యం ఇస్తున్నామంటూ వ్యాఖ్యలు చేశారు. అదుపుతప్పే పరిస్థితి నెలకొనటంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ జోక్యం చేసుకుని ఇరువురికీ సర్దిచెప్పి కార్యక్రమం ముగించుకుని వెళ్లిపోయారు.  

జనసేన గళం  
టీడీపీ నేతల వ్యవహార తీరుపై జనసేన నేతలూ తమ అసంతృప్తి వెళ్లగక్కారు. జనసేన నేత బొప్పన శివప్రసాద్‌ తమ పార్టీకి సరైన ప్రాధాన్యం లేదని ఎమ్మెల్యే ఎదుటే టీడీపీ నేతలను నిలదీయటంపై చర్చ జరుగుతోంది. జనసేనకు సముచిత స్థానం కలి్పంచటం లేదని బొప్పన ఆరోపించటం గమనార్హం.  

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)