Breaking News

ఎన్డీయేపై సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం?

Published on Tue, 07/25/2023 - 11:31

ఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో మణిపూర్‌ ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. అనూహ్య పరిణామం చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. విపక్ష కూటమి ఇండియా(INDIA) లోక్‌సభలో ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. 

మణిపూర్‌ అంశంపై ప్రధాని ప్రసంగంపై కేంద్రం వెనకడుగు వేస్తున్న వేళ.. విపక్షాల కూటమి ఇండియా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భాగంగా..  మంగళవారం ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే మణిపూర్‌ అంశం మళ్లీ కుదిపేసింది. ఈ క్రమంలో విపక్షాల ఆందోళనల నడుమ లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఆ తర్వాతే విపక్ష కూటమి  అవిశ్వాసం దిశగా  ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మణిపూర్‌ అంశంతో రాజ్యసభలోనూ గందరగోళం నెలకొనగా.. వాయిదా పడింది.  

ప్రధాని సెటైర్లు..
ఇండియా అని పేరు పెట్టుకున్నంత మాత్రానా(విపక్షాల) వారి తీరు మారుతుందా? అంటూ ప్రధాని మోదీ బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఇలాంటి దిశ దశ లేని ప్రతిపక్షాన్ని చూడలేదని వ్యాఖ్యానించిన ఆయన.. ఈస్ట్‌ ఇండియా కంపెనీ, ఇండియన్‌ ముజాహిద్దీన్‌లోనూ ఇండియా అనే పదం ఉందంటూ సెటైర్లు వేసినట్లు సమాచారం.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)