Breaking News

ఎంపీల సస్పెన్షన్‌పై నేడు దేశవ్యాప్త నిరసన

Published on Fri, 12/22/2023 - 10:43

ఢిల్లీ: పార్లమెంట్ నుంచి భారీ స్థాయిలో ఎంపీల సస్పెన్షన్‌పై ఇండియా కూటమి నేతలు నేడు దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విపక్ష ఎంపీలు ఆందోళన నిర్వహించనున్నారు. దేశంలో అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఇండియా కూటమి నేతలు శుక్రవారం అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు చేపట్టనున్నట్లు సస్పెన్షన్ అయిన ఎంపీల్లో ఒకరైన శశిథరూర్ తెలిపారు.

పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభ నుంచి 100 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు.  రాజ్యసభ నుంచి 46 మందిపై ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వేటు వేశారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై విపక్షాలు ఉభయ సభల్లో గందరగోళం సృష్టించారు. సభ నియమాలను అతిక్రమించినందుకు విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.

డిసెంబర్ 13న పార్లమెంట్‌లోకి నలుగురు ఆగంతకులు ప్రవేేశించారు. ఇద్దరు లోక్‌సభ లోపల గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో గ్యాస్ బాంబులను ప్రయోగించారు. దీంతో పార్లమెంట్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి అమిత్‌ షా మాట్లాడాలని విపక్ష నేతలు పట్టుబట్టారు.

ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి ఘటన.. నిందితులకు మానసిక పరీక్షలు


   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)