జార్ఖండ్‌ ఎన్నికలు.. ఇండియా కూటమిలో సీట్ల షేరింగ్‌ ఖరారు

Published on Sat, 11/02/2024 - 19:58

జార్ఖండ్‌లో ఎన్నికల సమరం మొదలైంది. 82 స్థానాల్లున్న రాష్ట్ర అసెంబ్లీకి నవంబర్‌ 13, 20 రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. భాగస్వామ్య పక్షాలతో సీట్ల పంపకం, అభ్యర్థుల ఎన్నికల, ప్రచారాలపై పార్టీలన్నీ నిమగ్నమయ్యాయి. అధికారమే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష కూటమిలు పావులు కదుపుతున్నాయి. తాజాగా అసెంబ్లీ ఎన్నికలకు ఇండియా కూటమి మిత్రపక్షాల మధ్య సీట్ల షేరింగ్‌ ఫార్మూలా పూర్తయ్యింది. 

ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) 43 స్థానాల్లో పోటీ చేయనుంది. కాంగ్రెస్ 30 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టనుంది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఆరు స్థానాల్లో పోటీ చేయనుండగా, వామపక్షాలు మూడు స్థానాల్లో ( నిర్సా, సింద్రీ, బగోదర్‌) పోటీ చేయనున్నాయి. 

అయితే ధన్వర్, బిష్రాంపూర్, ఛతర్‌పూర్‌లోని మూడు స్థానాల్లో సీపీఐ-ఎంఎల్‌తో జేఎంఎం స్నేహపూర్వకంగా పోరాడుతుందని జేఎంఎం ప్రధాన కార్యదర్శి వినోద్ పాండే తెలిపారు. మరోవైపు ధన్వార్‌లో బీజేపీ తమ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ బాబూలాల్‌ మరాండీని బరిలోకి దింపింది. జార్ఖండ్‌లోని 82 మంది సభ్యుల అసెంబ్లీకి నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇదిలా ఉండగా జేఎంఎం ఇప్పటికే తమ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బర్హెట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయగా, ఆయన భార్య కల్పనా ముర్ము సోరెన్ గాండే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి కలిసే పోటీ చేస్తుందని, మొత్తం 82 స్థానాలకు గాను 70 స్థానాల్లో కాంగ్రెస్, జేఎంఎంలు అభ్యర్థులను నిలబెడతాయని సోరెన్ గతంలోనే చెప్పారు.

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)