Breaking News

లోక్‌సభ ఎన్నికలపై ప్రతిపక్షాల కూటమి కీలక నిర్ణయం

Published on Tue, 03/12/2024 - 09:50

సాక్షి,న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్‌ (INDIA bloc) కీలక నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు కొద్ది రోజుల ముందే ప్రచార వ్యూహం, క్యాడర్ నిర్వహణ, ఉమ్మడి ర్యాలీలు నిర్వహించేలా ప్రతిపక్షాల కూటమి పార్టీలు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నికల వ్యూహాలను అమలు చేయనున్నాయి.    

ఈ సందర్భంగా ‘ప్రత్యర్ధి పార్టీల ఎత్తుకు పైఎత్తు వేస్తూ ఎన్నికల్లో గెలించేందుకు సమన్వయ కమిటీలు చాలా అవసరం. సమన్వయ కమిటీలు ఎన్నికల వ్యూహం, ఎన్నికల సందేశాలను ప్రజల్లో చేరవేసేందుకు సహాయ పడతాయి. కమిటీలలో వివిధ పార్టీల నుండి సమాన సంఖ్యలో సభ్యులు ఉంటారు’ అని కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతున్నారు.  

రాష్ట్రాల్లోని పార్టీ క్యాడర్‌ల సమన్వయం దిశగా మొదటి అడుగు ఇండియా కూటమి అభ్యర్థులు తీసుకుంటారు. వివిధ పార్టీల కార్యకర్తల మధ్య సమన్వయం ఎన్నికల్లో గెలవడానికి కీలకమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

త్వరలోనే ప్రకటన 
త్వరలో కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీలు ఢిల్లీ, హర్యానాలలో సమన్వయ కమిటీలను ప్రకటించే అవకాశం ఉందని, ఇప్పటికే సమన్వయ కమిటీ సభ్యుల పేర్లు కాంగ్రెస్‌ అధిష్టానానికి పంపినట్లు ఆప్‌ నేతలు వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. 
 
పొత్తులు ఎంత వరకు వచ్చాయంటే?
ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో, ఢిల్లీ, హర్యానా, గుజరాత్‌, గోవాలలో ఆమ్‌ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుంది. మహా వికాస్ అఘాడీ నియోజకవర్గాలైన శివసేన (యూబీటీ), మహారాష్ట్రలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ), తమిళనాడులోని డీఎంకే, లెఫ్ట్ ఫ్రంట్, జార్ఖండ్‌లోని జార్ఖండ్ ముక్తి మోర్చా, బీహార్‌లోని రాష్ట్రీయ జనతాదళ్ వంటి ప్రాంతీయ పార్టీలతో సీట్ల పంపకాల ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)