Breaking News

ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థి అవసరం లేదు: శరద్ పవార్

Published on Sun, 01/14/2024 - 07:21

ముంబయి: ఇండియా కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థిని ముందు ప్రకటించాల్సిన అవసరం లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ అన్నారు. కూటమి పేరుతోనే ఓట్లు అడగాలని శరద్ పవార్ పేర్కొన్నారు.  దేశానికి ఇండియా కూటమి ప్రత్యామ్నాయంగా మారగలదని చెప్పారు. 

ఇండియా కూటమి సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పవార్.. "కూటమి తరుపున ప్రధాని అభ్యర్థిని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ఇండియా పేరుతో ఓట్లు అడగాలని నేను నమ్ముతున్నా. దేశానికి ఇండియా కూటమి ప్రత్యామ్నాయాన్ని అందించగలదు." అని శరద్ పవార్ అన్నారు.

మొరార్జీ దేశాయ్ 1977లో జనతా పార్టీ నేతృత్వంలో ప్రధానమంత్రి అయినప్పుడు జరిగిన రాజకీయ మార్పులను కూడా పవార్ ప్రస్తావించారు. ఆనాటి ఎన్నికలకు ముందు జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిని ప్రకటించలేదని చెప్పారు. ప్రధానమంత్రి అభ్యర్థి, లోక్‌సభ సీట్ల పంపిణీపై వచ్చిన కొన్ని నివేదికలను తోసిపుచ్చుతూ "కూటమి సమూహంలో ఎలాంటి అసంతృప్తి లేదు" అని స్పష్టం చేశారు.

ఇండియా కూటమికి ఛైర్మన్‌గా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఎంపిక చేయడంపై పవార్ మాట్లాడుతూ.. "ఇండియా కూటమి అధ్యక్షుడిగా ఖర్గే ఉండాలని కొందరు నేతలు సూచించారు. చాలా మంది అందుకు అంగీకరించారు. నితీష్ కుమార్‌ను కన్వీనర్‌గా ప్రతిపాదించారు. అయితే.. అందుకు నితీష్ కుమార్ తిరస్కరించారు. ప్రస్తుతానికి అది అవసరం లేదు". అని ఆయన అన్నారు. 

ఇదీ చదవండి: ‘ఇండియా’కు ఖర్గే సారథ్యం!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)