Breaking News

నితీష్ ఆరోగ్యంగానే ఉన్నారు.. ఆయ‌న నాయకత్వంలోనే ఎన్నిక‌ల‌కు: జేడీయూ

Published on Wed, 07/10/2024 - 15:29

పాట్నా: వ‌చ్చే ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల‌పై జ‌న‌తాద‌ళ్ యునైటెడ్ (జేడీయూ) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ సంజ‌య్ కుమార్ ఝా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 2025 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ముఖ్యమంత్రి నితీష్ నేతృత్వంలోనే జేడీయూ బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు  ఆయ‌న పేర్కొన్నారు.

ఈ మేర‌కు ఓ జాతీయ మీడియాతో సంజ‌య్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం నితిష్ కుమార్ పూర్తి ఆరోగ్యంగా ఉన్న‌ట్లు తెలిపారు. ఇటీవ‌ల జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని త‌న భూజాల‌పై వేసుకొని న‌డిపించార‌ని ప్ర‌స్తావించారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న నాయకత్వంలోనే ముందుకు సాగ‌నున్న‌ట్లు చెప్పారు. అందులో ఎలాంటి సందేహం లేద‌ని తేల్చి చెప్పారు.

నితీష్ రాజ‌కీయాల్లో ప‌డిపోతున్నార‌ని అనుకున్న ప్ర‌తీసారి అత‌ను త‌న అద్భుత‌మైన ప‌నిత‌నంలో పున‌రాగ‌మ‌నం చేసి అంద‌రిని ఆశ్య‌ర్య‌ప‌రుస్తుంటార‌ని తెలిపారు. నితీష్‌పై ప్ర‌జ‌ల‌కు ఇంకా న‌మ్మ‌కం ఉంద‌ని చెప్పేందేకు లోక్‌స‌భ ఎన్నిక‌లే నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఏకంగా 177 స్ధానాల్లో ఎన్డీయేకు స్పష్టమైన ఆధిక్యం లభించిందని గుర్తుచేశారు. కాగా ఈ ఏడాది జనవరిలో ఇండియా కూట‌మి నుంచి ఎన్డీయేలోకి మారిన నితిష్ కుమార్ బీహార్ లోక్‌సభ ఎన్నికల్లో 12 సీట్లు సాధించి 'కింగ్‌మేకర్‌'గా అవతరించారు.

'బీహార్‌కు ప్రత్యేక హోదాపై సంజయ్ కుమార్ ఝా మాట్లాడుతూ, 2004 నుండి 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు భాగస్వామిగా ఉన్న ప్ర‌తిప‌క్షం బిహార్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని ఎప్పుడూ లేవనెత్తలేదు.  ప్రత్యేక హోదా గురించి వారు కనీసం ఒక్కసారి కూడా డిమాండ్‌ చేయలేదు.

మేము మాత్రం మొదటినుంచీ ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతున్నాం. ఈ విషయంలో సీఎం నితీష్‌ కుమార్‌ నిబద్ధతతో కృషి చేస్తున్నారు. భవిష్యత్‌లో బిహార్‌కు కొద్దిపాటి ఊతం లభించినా తాము కూడా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబడతాం. ప్రత్యేక హోదా విషయంలో అవరోధాలు ఏమైనా ఉంటే ప్రత్యేక ప్యాకేజ్‌ అయినా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నాం. దీనిపై రాజకీయాలు చేయకూడదు'‌. ఆయన అన్నారు.
 

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి