Breaking News

సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు: ఉదయనిధి

Published on Tue, 10/22/2024 - 13:06

చెన్నై: సనాతన ధర్మంపై తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా  దుమారం సృష్టించిన విషయం తెలిసిందే. సనాతన ధర్మం అనేది మలేరియా, డెంగీ వంటిదని, దాన్ని నిర్మూలించాలని గతంలో ఆయన పిలుపునిచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలకుగానూ స్థాలిన్‌కు వ్యతిరేకంగా హిందూ  సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో తాజాగా యన చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పందించారు.

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న తన పిలుపుపై క్షమాపణలు చెప్పబోనని స్పష్టం చేశారు. మహిళలపై జరిగిన అణచివేత పద్దతులను, వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు వివరణ ఇచ్చుకున్నారు. సనాతన ధర్మంపై  తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు.  ఆ విషయంలో ఎవరికీ క్షమాపణ చెప్పేది లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలపై న్యాయ పోరాటానికి కూడా సిద్ధమని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు.

సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ. పెరియార్, మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై, ఎం కరుణానిధి వంటి ద్రావిడ నాయకుల అభిప్రాయాలను తాను ప్రతిధ్వనించానని అన్నారు.

‘మహిళలను చదువుకోవడానికి అనుమతించ లేదు  వారు తమ ఇళ్లను వదిలి వెళ్ళలేకపోయారు. ఒకవేళ భర్త చనిపోతే వారు కూడా చనిపోవాలి. వీటన్నింటికీ వ్యతిరేకంగా తంతై పెరియార్ మాట్లాడారు. పెరియార్, అన్నా, కలైంజ్ఞర్ చెప్పిన దానినే నేను చెప్పాను’ అని ఉదయనిధి పేర్కొన్నారు.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)