Breaking News

శ్రీ మ‌హావిష్ణు విగ్ర‌హామే.. బెదిరిస్తే భయపడేటోన్ని కాదు: భూమన

Published on Tue, 09/16/2025 - 15:23

సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి అనుగ్రహంతోనే తాను రెండుసార్లు టీటీడీ చైర్మన్‌గా, మూడుసార్లు బోర్డు సభ్యుడిని అయ్యానని.. అలాంటి తనపై ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఎవరూ నమ్మరని టీటీడీ మాజీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి చెబుతున్నారు. అలిపిరి వద్ద స్వామివారి విగ్రహానికి అపచారం జరిగిన పరిణామంపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.  

అలిపిరి వద్ద ఘోర అపచారం జరిగింది. అది చెబితే నాపై కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఆది శ్రీవారి విగ్రహం కాదని.. శనీశ్వర విగ్రహం అని అంటున్నారు. శిల్పి చెక్కి పడేశాడని  నిరక్ష్యంగా సమాధానం చెబుతున్నారు.  శంఖు చక్రాలు ధరించిన విగ్రహం శని విగ్రహం ఎలా అవుతుంది?. శని విగ్రహానికి విల్లు, బాణం ఉంటుంది. కాబట్టి.. అది ముమ్మాటికీ శ్రీ మహావిష్ణువు విగ్రహమే. 

నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ఏడాదిన్నర కాలంగా మీరు ఏమి చేస్తున్నారు?. వైఖానస ఆగమ సత్రం తెలియని వాళ్ళు నాపై అసత్యాలు మాట్లాడుతున్నారు.  ఒక్కసారి అవకాశం ఇస్తేనే  దైవానుగ్రహంతో బోర్డు సభ్యులయ్యాం అని మీరు చెప్పుకుంటున్నారు. అదే స్వామివారి అనుగ్రహంతో రెండుసార్లు చైర్మన్‌, మూడుసార్లు బోర్డు సభ్యుడిని అయ్యాను నేను. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపినా వాస్తవాలే చెబుతుంటాను నేను. 

హిందూ ధర్మం పట్ల పూర్తి నమ్మకం ఉన్నవాడిని. కాబట్టి నాపై ఎన్నిసార్లు.. ఎంత దుష్ప్రచారం చేసినా ఎవ్వరు నమ్మరు.  రాజకీయాలు కంటే నాకు హిందూ ధర్మ పరిరక్షణే నాకు ముఖ్యం. నేను నాయకుడ్ని కాదు.. స్వచ్ఛమైన హిందువును అని భూమన ఉద్ఘాటించారు.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)