Breaking News

‘‘నేనే సీఎం.. నేనే డిప్యూటీ సీఎం’’

Published on Mon, 12/23/2024 - 12:37

కర్నూలు, సాక్షి: కూటమి ప్రభుత్వంలో ఉండడం ఏమోగానీ.. అధికార మదంతో రోజుకొకరు వార్తల్లో నిలుస్తున్నారు. తాము ఏం చెబితే అదే శాసనం అనేలా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులకు వార్నింగ్‌లు ఇస్తున్నారు. తాజాగా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆ తరహా దురుసు వ్యాఖ్యలే చేశారు.

కూటమి నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ నేనే సీఎం.. నేనే డిప్యూటీ సీఎం. నేను చెబితే చంద్రబాబు చెప్పినట్టే. నేను చెబితే పవన్ కల్యాణ్‌ చెప్పినట్లే.  ఎవరైతే ఇన్నాళ్లూ..  ఫీల్డ్ అసిస్టెంట్లు, మిడ్ డే మీల్స్ ఏజెన్సీలు,  రేషన్ షాపులు కొనసాగిస్తున్నారో వాళ్లంతా ఉన్నపళంగా వదలేసి వెళ్లిపోవాలి. 

.. అధికారుల నుంచి ఎలాంటి లేఖలు తేవడాల్లాంటివి ఉండవు. వాళ్లంతా లబ్ధి చేకూర్చేవన్నింటిని విడిచిపోవాలి. నేను చెప్పిందే ఒక పెద్ద లెటర్‌. లేకుంటే లెక్క మరోలా ఉంటుంది’’ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. మరోవైపు.. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేసిన కాసేపటికే ఆయన వర్గీయులు రెచ్చిపోయారు. ఐదు రేషన్‌ షాపులకు తాళాలు వేసి.. ‘ఇక నుంచి ఇవి మావే’ అంటూ ప్రకటన చేశారు. దీంతో రేషన్‌ డీలర్లు షాక్‌కు గురయ్యారు.

‘‘ఎన్టీఆర్‌ హయాం నుంచి ఆ రేషన్‌ షాపులను తామే నడుపుకుంటున్నామని, ఇప్పుడు ఉన్నపళంగా లాగేసుకోవడం ఏంటని, తమ షాపులు లాకుంటే తాము రోడ్డున పడుతామంటూ’’ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అహం భావంతో ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)