Breaking News

AP: బీజేపీ ఒంటరి పోరు!.. పోటీకి భారీగా దరఖాస్తులు

Published on Sat, 03/02/2024 - 09:16

సాక్షి, విజయవాడ: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు బీజేపీ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో పోటీకి రికార్ఢు స్థాయిలో దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. దీంతో, టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తు ఆసక్తికరంగా మారింది.

అయితే, ఏపీలో పొత్తులు లేకపోయినా పోటీకి సై అంటూ బీజేపీ అభ్యర్థులు వేలాదిగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఇప్పటి వరకు 3283 దరఖాస్తులు వచ్చాయి. ఒక్క గుంటూరు జిల్లా నుంచే దాదాపు 125కుపైగా దరఖాస్తులు రావడం విశేషం. ఇక, 25 లోక్‌సభ స్థానాలకుగానూ 1861 దరఖాస్తులు అందాయి. 

పార్లమెంట్‌ స్థానాలపై ఫోకస్‌..
మరోవైపు.. నేడు శివప్రకాష్‌ జీ ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగనుంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురు, ప్రతీ లోక్‌సభ స్థానానికి మూడు పేర్ల చొప్పున అభ్యర్థుల జాబితాను ఎంపిక చేసి శివప్రకాష్‌ పార్టీ జాతీయ నాయకత్వానికి పంపనున్నారు. ప్రతీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర స్థాయి బాధ్యతల్లో ఉన్న నేతలు నేడు జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. ప్రతీ పార్లమెంట్‌ స్థానంపై చర్చించడానికి ఒక గంట సమయం కేటాయించినట్టు సమాచారం. 

పొత్తులపై నో కామెంట్స్‌..
మరోవైపు.. టీడీపీ, జనసేన ఏకపక్ష ప్రకటనలపై బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏపీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని ఇటీవల జరిగిన కోర్‌ కమిటీ సమావేశాల్లో మెజార్టీ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తేనే బీజేపీకి ఓటు షేర్‌ పెరుగుతుందని నేతలు చెబుతున్నారు. ఇక, ఏపీ చీఫ్‌ పురంధేశ్వరిపైన స్థానిక నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా బీజేపీలో ఉన్న టీడీపీ నేతలపై అసంతృప్తులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో, పొత్తుల అంశంపై ఎవరూ మాట్లాడవద్దని అధిష్టానం ఆదేశించినట్టు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా.. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం అధికార వైఎస్సార్‌సీపీ సహా ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తూ దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యూహాలకు ప్రతిపక్ష పార్టీలకు చుక్కలు కనిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీ-జనసేన కూటమి తొలి అభ్యర్థుల జాబితా నేపథ్యంలో టికెట్‌ దక్కనివారు చంద్రబాబు, పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల నిరసనలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి.  

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)