Breaking News

డింపుల్ వీడియోలు వైర‌ల్‌.. అఖిలేశ్ అరెస్ట్‌

Published on Tue, 07/21/2026 - 20:13

న్యూఢిల్లీ: స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేశ్ యాద‌వ్ స‌తీమ‌ణి ఎంపీ డింపుల్ యాదవ్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. కాక్రోజ్ జ‌న‌తా పార్టీ (సీజేపీ) మ‌ద్ద‌తుదారులు, ప్ర‌జాస్వామిక వాదులు.. ఆమెను ప్ర‌శంసిస్తున్నారు. విద్యార్థుల‌ ఉద్య‌మంలో ఆమె చూపించిన తెగువ, మానవ‌త్వం అంద‌రినీ ఆక‌ట్టుకుంది. యువ‌త‌పై పోలీసుల దాడుల‌ను ధైర్యంగా ప్ర‌శ్నించారు. ముఖ్యంగా యువ‌తుల‌పై పోలీసుల దాష్టీకాన్ని నిల‌దీశారు. పోలీసుల దాడిలో గాయ‌ప‌డిన వారికి స‌ఫ‌ర్యలు చేసి అమ్మ‌గా ఆద‌రించారు. భ‌యంతో వ‌ణికిపోతున్న‌ చిన్న పిల్ల‌ల‌ను ప్రేమ‌గా ద‌గ్గ‌ర‌కు తీసుకుని భ‌రోసా క‌ల్పించారు.

సీజేపీ పిలుపు మేర‌కు సోమ‌వారం ఆమె త‌న పార్టీ నాయ‌కుల‌తో కలిసి చ‌లో సంస‌ద్ ఆందోళ‌న కార్య‌క్ర‌మంలో పాలు పంచుకున్నారు. విద్యార్థుల‌కు మ‌ద్ద‌తుగా ర్యాలీలో చురుగ్గా పాల్గొన్నారు. పోలీసులు, భ‌ద్ర‌తా సిబ్బంది అడుగడుగునా అడ్డుప‌డినా ముందుకు సాగారు. విద్యార్థుల‌కు నైతిక స్థైర్యాన్ని ఇచ్చి తాను కూడా వారితో పాటు ఆందోళ‌న‌లో భాగ‌మ‌య్యారు. యువ‌త ప‌ట్ల నిర్ద‌య‌గా వ్య‌హ‌రించిన పోలీసుల తీరును గ‌ర్హించారు. పోలీసులు గూండాల్లా వ్య‌వ‌హ‌రించార‌ని ధ్వ‌జ‌మెత్తారు. భారత చరిత్రలో ఇంత అహంకారపూరితమైన, క్రూరమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ లేదని మండిప‌డ్డారు. మంగ‌ళ‌వారం నాడు కూడా సీజేపీ పోరాటానికి సంఘీభావం ప్ర‌క‌టించారు. 

డింపుల్ వీడియోలు వైర‌ల్‌
కాక్రోజ్ జ‌న‌తా పార్టీ  పోరాటంలో డింపుల్ యాద‌వ్ పాల్గొన్న వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసిన వారంతా ఆమెపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. నాయ‌కులు ఎప్పుడూ ప్ర‌జ‌ల ప‌క్షాన ఉండాల‌ని కోరుతున్నారు. కాగా, బీజేపీ మ‌ద్ద‌తుదారులు మాత్రం డింపుల్ యాద‌వ్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఓట్ల కోస‌మే ఆమె ఇదంతా చేస్తున్నార‌ని ట్రోల్ చేస్తున్నారు. 

 

అఖిలేశ్ యాద‌వ్‌ అరెస్ట్‌
కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీతో పాటు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నివాసం వ‌ద్ద ధ‌ర్నాకు దిగిన స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత‌ అఖిలేశ్ యాద‌వ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే, ఎంపీ ప్రియాంక గాంధీతో పాటు ప‌లువురు నాయ‌కుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్క‌డి నుంచి త‌ర‌లించారు. అఖిలేశ్ యాద‌వ్ అరెస్ట్‌ను స‌మాజ్‌వాదీ పార్టీ ఖండించింది. మోదీ స‌ర్కారు నిరంకుశంగా వ్య‌వ‌హ‌రిస్తూ ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిప‌డింది. 

చ‌ద‌వండి:  చాలెంజ్ అంటూ జంపింగ్‌లకు ఇచ్చిపడేసిన మమత బెన‌ర్జీ

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)