Breaking News

టీడీపీతో పొత్తులాంటి నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్‌కు మనుగడ ఎలా?

Published on Thu, 04/13/2023 - 04:39

సాక్షి, అమరావతి: విభజన తర్వాత కూడా ఒక దశలో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు 8 శా­తానికి పెరిగినట్లు ఓ సర్వేలో తేలిందని, ఆ సమయంలో ఆ పార్టీ పెద్దలు హఠాత్తుగా టీడీపీ­తో పొత్తు పెట్టుకున్నారని, ఇలాంటి నిర్ణయాల వల్ల ఆ పార్టీ ఎలా ముందుకు పోతుందని మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించా­రు. రెండోసారి తాను కాంగ్రెస్‌లో చేరిన తర్వాత పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తానన్నా.. తాను నిరాకరించానని తెలిపారు. ఇటీవలే బీజేపీలో చేరిన ఆయన బుధవారం విజయవాడ వచ్చారు.

రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో ఉండే వారికి ప్రజాజీవితంలో కొనసాగే పరిస్థితి లేదని.. తాను ఇంకా ప్రజాజీవితంలో కొనసాగాలనే బీజేపీలో చేరినట్టు వివరించారు.  రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోరుకుంటున్నప్పటికీ.. గతంలో కేంద్రం హోదాకు బదులు ప్యాకేజీ ఇవ్వడానికి సిద్ధపడగా అప్పటి ప్రభుత్వం దానికి అంగీకరించిందని పరోక్షంగా చంద్రబాబు నిర్ణయాన్ని గుర్తుచేశారు.

మూడు రాజధానులపై పార్టీ అభిప్రాయమే తన అభిప్రాయమని తెలిపారు. తన తమ్ముడు టీడీపీలో కొనసాగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఏ పా ర్టీలో కొనసాగాలన్నది వారి వ్యక్తిగత నిర్ణయమన్నారు. విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)