Breaking News

సామాజిక న్యాయానికి చాంపియన్‌..సీఎం జగన్‌

Published on Sun, 12/17/2023 - 18:35

సాక్షి, తూర్పుగోదావరి : ఏ ముఖ్యమంత్రి జగనన్నలాగా సామాజిక న్యాయం పాటించలేదని హోం మంత్రి తానేటి వనిత కొనియాడారు. జ్యోతిరావు పూలే, బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆశయాలను  సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆచరణలో చూపారన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్‌లతో కలిసి వనిత పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 

‘స్కూళ్లలో డ్రాప్ అవుట్స్ ఉండకూడదని అమ్మ ఒడి పథకాన్ని సీఎం జగన్‌ తీసుకువచ్చారు. గతంలో మన పిల్లల కోసం ఆలోచించిన సీఎంను చూశారా? సీఎం జగన్మోహన్ రెడ్డి మన బిడ్డల చదువులు, ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నారు. మహిళా సాధికారత కోసం చేయూత, కాపు నేస్తం, ఇచ్చారు. అగ్ర వర్ణాల్లో ఉన్న పేదలను గుర్తించిన సీఎం మన జగనన్న 32లక్షల ఇళ్ళ స్థలాలు ఉచితంగా ఇచ్చారు. మహిళకు పుట్టింటి కానుకగా ఇంటి స్థలాన్ని ఇచ్చారు’అని వనిత చెప్పారు. 

గ్రామ సచివాలయం వ్యవస్థతో జగనన్న పాలన మన ముంగిటకు చేర్చారు. ప్రజల్లోకి వెళ్ళలేక ప్రతి పక్షాలు.. చిన్న పిల్లల ట్యాబ్‌లపై బురద చల్లుతున్నారు. ట్యాబ్‌లను సైతం రాజకీయలకు వాడుకుంటున్నారు. మీ పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదవవచ్చు కానీ పేదలు చదవ కూడదా...?దళితులకు పెద్ద పీట వేస్తూ నన్ను హోం మంత్రిని చేశారు’అని వనిత తెలిపారు. 

మంత్రి చెల్లుబోయిన మాట్లాడుతూ..

‘మహిళా సాధికారితకు సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేశారు.చంద్ర బాబు ఒక అబద్ధం. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచాడు. వైఎస్‌ఆర్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తే దానిలో కోతలు పెట్టాడు. రైతులు, డ్వాక్రా మహిళలను రుణమాఫీ పేరు చెప్పి మోసం చేశాడు. 2లక్షల 60వేల కోట్ల రూపాయలను పేదలకు ఇచ్చింది సీఎం జగన్మోహన్ రెడ్డి’అని అన్నారు. 

మంత్రి కారుమూరి మాట్లాడుతూ..

‘ఏపీలో 11శాతం  ఉన్న పేదరికాన్ని  ఆరు శాతానికి సీఎం జగన్మోహన్‌రెడ్డి తగ్గించారు. దోపిడీ దారులు చంద్రబాబు హయాంలో ఉండేవారు.  సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో అమ్మ ఒడితో పిల్లలను బడిబాట పట్టేలా చేశారు. రూ.65వేల కోట్లు పిల్లల విద్యకు ఖర్చు పెట్టారు. పెత్తందారులు, ఎల్లో మీడియా, చంద్రబాబు పేద పిల్లల విద్య పై  విషం చిమ్ముతున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేసింది సీఎం జగన్మోహన్‌రెడ్డి’అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నందిగామ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఇదీచదవండి..అమరావతిపై బాబుకు వైఎస్‌ఆర్‌సీపీ ప్రశ్నలు

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)