Breaking News

హిట్ అండ్ రన్ : మహిళ ప్రాణం తీసిన అధికార పార్టీ నేత కుమారుడు!

Published on Sun, 07/07/2024 - 15:52

ఓ అధికార పార్టీకి చెందిన నేత కుమారుడి నిర్వాకంతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు తన లగ్జరీ బీఎండబ్ల్యూ స్పోర్ట్స్‌ కారుతో మహిళ, ఆమె భర్త ప్రయాణిస్తున్న స్కూటీని అతివేగంతో ఢీకొట్టాడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ హిట్‌ అండ్‌ రన్‌ ప్రమాదంలో బాధితురాలు గాల్లోంచి ఎగిరి దూసుకెళ్లింది. 100 మీటర్ల అవతల పడిపోయింది. చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఇంతకీ ఆ రాజకీయ నేత ఎవరు?

ముంబై వర్లిలోని అట్రియా మాల్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం 5.30గంటల సమీపంలో బీఎండబ్ల్యూ కారు దంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య కావేరీ నక్వా దుర్మరణం చెందగా.. భర్త పార్థిక్‌‌ నక్వా తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.అయితే ఆ బీఎండబ్ల్యూ కారు ముంబై అధికార ఏక్‌ నాథ్‌ షిండ్‌ నేతృత్వంలోని శివసేన పార్టీ నేత రాజేష్‌ షాకి చెందినదిగా పోలీసులు గుర్తించారు.

ప్రమాద సమయంలో మహరాష్ట్ర పాల్ఘర్ జిల్లా శివసేన నేత రాజేష్‌ షా బీఎండబ్ల్యూ స్పోర్ట్స్‌ కారును ఆయన కుమారుడు మిహిర్‌ షా డ్రైవ్‌ చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. ఆదివారం ఉదయం 5.30గంటల సమయంలో మిహిర్‌ షా తన బీఎండబ్ల్యూ స్పోర్ట్స్‌ కారుతో వ్రోలి ప్రాంతానికి వెళుతున్నాడు. అదే సమయంలో  సాసూన్ డాక్ ఫిష్‌ మార్కెట్‌కి వెళ్లి తిరిగి వస్తున్న దంపతులు ప్రయాణిస్తున్న స్కూటీని బలంగా ఢీకొట్టారు.

ఈ కారు ప్రమాదంతో బాధితురాలు గాల్లోకి దూసుకెళ్లింది. సుమారు 100 మీటర్ల అవతల పడిపోవడంతో తీవ్రగాయాల పాలైంది. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు బాధితుల్ని అత్యవసర చికిత్స కోసం నాయర్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న భార్య మరణించగా.. భర్తకు గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. 

కారు ఎవరిదో.. నిర్ధారించే పనిలో పోలీసులు 
మరోవైపు రోడ్డు ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారును వ్రోలీ పోలీసులు సీజ్‌ చేశారు. ఈ కారు ఎవరిది? శివసేన పార్టీ నేత రాజేష్‌ షాకి చెందినదేనా? ప్రమాదానికి కారకులు ఎవరనేది త్వరలో నిర్ధారిస్తామన్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

సీఎం షిండే ఆగ్రహం.. పోలీస్‌ శాఖకు ఆదేశాలు
తన పార్టీకి చెందిన నేత కుమారుడు హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ఓ మహిళ ప్రాణాలు పోయిందంటూ అటు జాతీయ మీడియా, ఇటు సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ కావడంతో ముంబై సీఎం ఏక్‌నాథ్‌ షిండ్‌ స్పందించారు. ప్రమాదానికి కారకులైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని హెచ్చరించారు. నిందితుల్ని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వ్రోలీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)