Breaking News

ప్రపంచవ్యాప్తంగా రైట్‌వింగ్‌ నేతలపైనే టార్గెట్‌: అస్సొం సీఎం

Published on Sun, 07/14/2024 - 18:12

ఢిల్లీ: అమెరికా మాజీ ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌పై జరిగిన కాల్పులను ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా ఖండించారు. 

తాజాగా ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనపై అస్సొం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు.  ట్రంప్‌ త్వరగా కోలుకోవాలని ఎక్స్‌ వేదికగా తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా రైట్‌ వింగ్‌ నేతలను లెఫ్ట్‌ వింగ్‌ పార్టీలు టార్గెట్‌ చేస్తున్నాయని అ‍న్నారు. దేశమే తొలి ప్రాధాన్యం అనే జాతీయవాదాన్ని కలిగి ఉన్న నేతలను ఎవరు ఓడించలేరని తెలిపారు.

‘‘భౌతికంగా, మరోరకంగా ప్రపంచవ్యాప్తంగా రైట్‌ వింగ్‌ నేతలపై లెఫ్ట్‌ పార్టీ దాడులతో టార్గెట్‌ చేస్తోంది. ఈ దాడులు జాతీయవాదం కలిగి ఉండే నేతలను ఓడించలేవు. జాతీయవాదం అనేది పూర్తిగా ఆధ్యాత్మిక సనాతనతత్వం నుంచి ప్రేరణ పొందింది. డొనాల్డ్‌ ట్రంప్‌ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.

 

ఇక, శనివారం పెన్సిల్వేనియాలో చేపట్టిన  ప్రచారంలో పాల్గొన్న ట్రంప్‌పై ఓ గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్‌ ట్రంప్ చెవిని తాకుతూ పక్కనుంచి దూసుకుపోవటంతో గాయమైంది. వెంటనే అప్రత్తమై సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు వేదిక పైకి వచ్చి.. ట్రంప్‌ను అక్కడి కిందకు దించి ఆస్పత్రికి తరలించారు.

ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) తాజాగా గుర్తించింది. అతణ్ని 20 ఏళ్ల థామస్‌ మాథ్యూ క్రూక్స్‌గా ధ్రువీకరించారు. పెన్సిల్వేనియాలోని బెతెల్‌ పార్క్‌కు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. యూఎస్‌ సీక్రెట్ సర్వీస్ అధికారులు క్రూక్స్‌ను షూట్‌ చేసినట్లు ఎఫ్‌బీఐ ఏజెన్సీ ప్రతినిధి ఆంథోనీ గుగ్లీల్మి వెల్లడించారు. ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో సహా ప్రపంచ దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు.

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)