Breaking News

మేకప్‌ లేకుంటే కంగనాను గుర్తుపట్టరు: మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Published on Thu, 09/05/2024 - 10:20

 మండీ: హిమాచల్ ప్రదేశ్‌లోని  మండీ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై ఆ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగత్‌ సింగ్‌​ నేగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర శాసనసభలో చర్చ సందర్భంగా జగత్ సింగ్ కంగన అంశాన్ని ప్రస్తావించారు. ‘జూన్ చివర్లో ముంచెత్తిన వర్షాలు, వరదలతో మన రాష్ట్రం అతలాకుతలమైంది. నేతలంతా వరద ప్రభావితకాలంలోనే పర్యటించి బాధితులను ఓదార్చారు. కంగన ప్రాతినిధ్యం వహిస్తున్న మండీ నియోజకవర్గం సైతం వర్గం, వరద బారిన పడింది.

కానీ కంగన పరద సమయంలో పర్యటించలేదు. ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టి అంతా సర్దుకున్నాక తీరిగ్గా కంగన పర్యటించారు. వర్షాల కాలంలో ఆమె బయటకు రాదు. ఎందుకంటే వర్షం కారణంగా ఆమె వేసుకున్న మేకప్ పోతుంది. మేకప్ లేకుంటే కంగనను ఎవరూ గుర్తుపట్టలేరు. ఎదురుగా ఉన్నది కంగననా? లేక ఆమె తల్లినా? అనేది కూడా ఎవరూ పోల్చుకోలేరు" అని అన్నారు. దీంతో బీజేపీ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

కాగా ఇటీవేల హిమాచల్‌ ప్రదేశ్‌ను భారీ వరదలు అతలాకుతలం చేశాయి. ఈ వర్షాల వల్ల దాదాపు 153 మంది మరణించారు. సుమారు రూ.1271 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దీంతో, వరద ప్రభావిత ప్రాంతాన్ని ఆగష్టు 7న కంగన సందర్శించి.. బాధితులను పరామర్శించారు. ఆ ఫొటోలను కంగనా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఆ ఫొటోలపై జగత్‌ సింగ్‌ నేగి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)