Breaking News

తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్తత.. జేసీ వర్గీయుల ఓవరాక్షన్‌

Published on Fri, 07/18/2025 - 10:21

సాక్షి,అనంతపురం: తాడిపత్రిలో మరోసారి రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని అడ్డుకునేందుకు జేసీ వర్గీయులు ప్రయత్నించబోయారు. ఈ క్రమంలో పోలీసుల జోక్యంతో పరిస్థితి ఒక్కసారి ఉద్రిక్తంగా మారింది. 

తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం జరగాల్సి ఉంది. అయితే.. కేతిరెడ్డిని నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వనంటూ టీడీపీ సీనియర్‌ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లే పోలీసులు సైతం.. పెద్దారెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

అయినా జేసీ వర్గీయులు శాంతించలేదు. వైఎస్సార్‌సీపీ సమావేశ వేదిక వద్దకు జేసీ నివాసం నుంచి ర్యాలీగా బయల్దేరారు. ఈ క్రమంలో పరిస్థితి చేజారిపోయే అవకాశం ఉందని భావించిన పోలీసులు.. వాళ్లను అడ్డుకోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

అంతకు ముందు.. సమావేశానికి హాజరయ్యేందుకు పెద్దారెడ్డి స్వగ్రామం తిమ్మంపల్లి గ్రామం నుంచి తాడిపత్రి బయలుదేరారు. పెద్దారెడ్డి రాకపై అప్రమత్తమైన పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశానికి అనుమతి ఉందంటూనే.. పెద్దారెడ్డి మాత్రం వచ్చేందుకు వీలులేదని ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. పెద్దారెడ్డి మినహా మిగిలిన వైఎస్సార్‌సీపీ నేతలు కావచ్చంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు, పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండేందుకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయినప్పటికీ తనపై పోలీసులు ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

జేసీ ప్రభాకర్ రెడ్డికి నేనంటే భయం: కేతిరెడ్డి పెద్దారెడ్డి
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నన్ను చూసి భయపడుతున్నారు. అందుకే పోలీసుల ద్వారా నన్ను అడ్డుకుంటున్నారు. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా పోలీసులు జేసీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ 
తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ సమావేశానికి వెళ్తున్న తనను అడ్డుకోవడం దుర్మార్గం.18వ తేదీన అనుమతిచ్చి.. ఇప్పుడు వెళ్లొద్దంటే ఎలా?. తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చి మూడు మాసాలవుతోంది. తాడిపత్రి వెళ్లేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా?తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది.   

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)