Breaking News

Rishikesh: ‘హిమాచల్‌’ సంక్షోభం మళ్లీ మొదటికి..?

Published on Sat, 03/09/2024 - 13:38

రిషికేష్‌: హిమాచల్‌ప్రదేశ్‌ సంక్షోభం మళ్లీ  మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడ్డ ఆరుగురు కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మొత్తం 11 మంది తాజాగా  శనివారం(మార్చ్‌ 9)  ఒక ప్రత్యేక బస్సులో బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌ చేరుకున్నారు.

అత్యంత భద్రత నడుమ బస్సు దిగి తాజ్‌ రిషికేష్‌ హోటల్‌లోనికి ఎమ్మెల్యేలు వెళ్లారు. శుక్రవారమే హిమాచల్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కలిశారు. రెబల్స్‌ను మళ్లీ తీసుకుంటారా అని ఢిల్లీలో మీడియా ఆయనను ప్రశ్నించగా తప్పు తెలుసుకుంటే మరో చాన్స్‌కు అర్హులవుతారు అని సుఖు సమాధానమిచ్చారు. ఇంతలోనే రెబల్‌ ఎమ్మెల్యేలు మళ్లీ క్యాంపునకు వెళ్లడం చర్చనీయాంశమైంది.

కాగా, ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు  కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేయడంతో బలం లేని కాషాయ పార్టీ అభ్యర్థి రాజ్యసభ ఎంపీగా గెలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి అభిషేక్‌ మనుసింఘ్వి ఓటమి పాలయ్యారు. ఈ సంక్షోభం తర్వాత స్పీకర్‌ ఆరుగురు కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలపై  అనర్హత వేటు వేశారు. దీంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనారిటీ నుంచి బయటపడి మళ్లీ మెజారిటీలోకి వెళ్లింది. అయితే స్పీకర్‌ నిర్ణయంపై రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌పై సుప్రీం నిర్ణయం వెల్లడించాల్సి ఉంది.    

ఇదీ చదవండి.. లోక్‌సభ ఎన్నికల వేళ.. బిహార్‌లో ఈడీ దాడుల కలకలం

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)