Breaking News

జమిలి ఎన్నికలపై సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

Published on Sat, 09/21/2024 - 13:26

హైదరాబాద్‌, సాక్షి: ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం సీతారాం ఏచూరి సంస్మరణ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన రేవంత్‌ మాట్లాడుతూ.. జమిలి ఎన్నికల ముసుగులో కొందరు దేశాన్ని కబలించాలనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏచూరి లేకపోవడం తీరని లోటు. ఏచూరి చూపిన మార్గంలో జమిలి ఎన్నికలను అడ్డుకుంటాం.. పోరాడతాం అని అన్నారాయన. 

జమిలి ఎన్నికలతో అధికారం కాపాడుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. రాజ్యాంగ మార్పులు, సవరణల విషయంలో ఆ పార్టీ ఎలా వ్యవహరిస్తుందో చూస్తున్నాం. దేశ ఐక్యతను బీజేపీ దెబ్బ​ తీయాలని చూస్తోంది. దీనికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలి’’ అని రేవంత్‌ పిలుపుచ్చారు. 

‘‘దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తికి సీతారాం ఏచూరి కృషి చేశారు. పేదల కోసం పాటు పడ్డారు. జీవితకాలం నమ్మిన సిద్దాంతం కోసం కట్టుబడి ఉండే వ్యక్తులు అరుదు. రాహుల్‌గాంధీతో సీతారాం ఏచూరికి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. దశబ్దాలపాటు పేదల సమస్యలపై సీతారాం ఏచూరి కృషి చేశారు’’ అని రేవంత్‌ గుర్తు చేశారు. 

అంతకు ముందు.. సీతారాం ఏచూరి చిత్రపటానికి కేటీఆర్‌, తమ్మినేని నివాళులర్పించారు. కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రజల కోసం పనిచేసి సీతారాం ఏచూరి చిరస్థాయిగా నిలిచారు. ప్రస్తుతం నేతలు పదవుల చుట్టూ పరిభ్రమిస్తున్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరివరకు సీతారాం ఏచూరి నిలబడ్డారు అన్నారు. 

రేవంత్‌ రాకముందే కేటీఆర్‌ ఎగ్జిట్‌
ఒకేవేదికపై రేవంత్‌, కేటీఆర్‌ ఉంటారని తొలుత చర్చ నడిచింది. అయితే సభ ప్రారంభ సమయంలోనే కేటీఆర్‌ మాట్లాడి వెళ్లిపోయారు. కేటీఆర్ వెళ్లిపోయాకే సభకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. అంతకు ముందు.. కోదండరాం పక్కనే కూర్చున్న కేటీఆర్ మాట కూడా మాట్లడలేదు. కేటీఆర్ తన ప్రసంగం ముగిశాక.. అప్పుడు కోదండరాం పలకరించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)