Breaking News

ప్రధానిని కలిసిన హేమంత్‌ దంపతులు..

Published on Wed, 11/27/2024 - 08:18

న్యూఢిల్లీ: జార్ఖండ్ తాత్కాలిక ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని  కలుసుకుని సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు. నవంబర్ 28న రాంచీలోని మోర్హబడి మైదానంలో జార్ఖండ్‌ నూతన సీఎంగా హేమంత్‌ సోరెన్‌ ప్రమాణం చేయనున్నారు.  

ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు హేమంత్‌ సోరెన్‌ అతని సతీమణి, గండే నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కల్పనా సోరెన్ ఢిల్లీకి వెళ్లారు. కాగా  రాజధాని రాంచీలోని  సీఎం ‍ప్రమాణ స్వీకారోత్సవానికి సన్నాహాలు  ఘనంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తేజస్వీ యాదవ్ సహా పలువురు ప్రముఖులు  ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలున్నాయి.  
 

మొన్నటి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో  ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) మొత్తం 56 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నాయి. జేఎంఎం ఒక్కటే 34 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ(ఎంఎల్) రెండు స్థానాల్లో విజయం సాధించాయి. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జార్ఖండ్ తాత్కాలిక ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన ఎమ్మెల్యే భార్య కల్పనా సోరెన్‌తో కలిసి న్యూఢిల్లీ చేరుకున్నారు. వారు ప్రధాని మోదీని కలుసుకుని ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు.



ఇది కూడా చదవండి: ప్రియురాలిని హత్య చేసి.. రాత్రంతా మృతదేహంతోనే గడిపి..

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)