Jharkhand: కుదిరిన పొత్తు.. 70 స్థానాల్లో కాంగ్రెస్‌, జేఎంఎం పోటీ

Published on Sat, 10/19/2024 - 17:53

రాంచీ: త్వరలో జరగబోయే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మి క‌లిసిక‌ట్టుగా పోటీ చేయ‌నున్న‌ట్లు  ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ ప్ర‌క‌టించారు. ఈ క్రమంలో అధికార కూటమి పార్టీలైన జేఎంఎం, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకుగానూ 70చోట్ల కాంగ్రెస్‌, జేఎంఎం పార్టీల అభ్యర్థులను నిలబెడతారని హేమంత్ సోరెన్‌ వెల్లడించారు. 

సీట్ల పంపకాలపై ప్రస్తుతం మరిన్ని వివరాల్లోకి వెళ్లదల్చుకోలేదని, తమ మా కూటమి భాగస్వామి ప్రస్తుతం ఇక్కడ లేరని తెలిపారు. వారు వచ్చినప్పుడు మిత్రపక్షాల నేతల సమక్షంలోనే సీట్ల సంఖ్యను, ఇతర వివరాలను ఖరారు చేసుకుంటామని పేర్కొన్నారు.  మిగతా 11 స్థానాల్లో ఇతర కూటమి భాగస్వాములు ఆర్జేడీ, వామపక్ష పార్టీలతో చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు.

కాగా జార్ఖండ్‌ ఎన్నికలకు ఇటీవలే నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రంలో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 13, 20 తేదీల్లో ఓటింగ్ జరగనుండగా.. అదే నెల 23వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో జేఎంఎం 43 స్థానాల్లో, కాంగ్రెస్ 31 స్థానాల్లో పోటీ చేశాయి. జేఎంఎం 30, కాంగ్రెస్ 16, ఆర్జేడీ ఒక సీటు గెలుచుకున్నాయి. దీంతో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఈసారి జేఎంఎం త‌మ సీట్ల సంఖ్య‌ను పెంచే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఆర్జేడీ అసంతృప్తి
సోరెన్‌ ప్రకటనపై ఆర్జేడీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జేఎంఎం, కాంగ్రెస్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాయంటూ స్పందించింది. ఎన్నికల్లో పోటీ విషయంలో తమ ముందు అన్ని అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. 15- 18 స్థానాల్లో ఒంటరిగానే బీజేపీను ఓడించే సత్తా ఆర్జేడీకి ఉందని వ్యాఖ్యానించింది. 

డీజీపీపై వేటు
ఇదిలా ఉండగా ఝార్ఖండ్‌ తాత్కాలిక డీజీపీ అనురాగ్‌ గుప్తాపై భారత ఎన్నికల సంఘం వేటు వేసింది. ఎన్నికల నిర్వహణ విషయంలో గతంలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆయన్ను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)