అరవింద్‌ కేజ్రీవాల్‌కు బిగ్‌ షాక్‌!

Published on Wed, 01/29/2025 - 18:35

ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ, ఆప్‌ మధ్య పొలిటికల్‌ వార్‌ నడుస్తోంది. ఈ క్రమంలో యమనా నది నీటి విషయంలో ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. యమునా నీటిలో విషం కలిపారని వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన హర్యానా సీఎం నాయబ్‌ సింగ్‌ సైనీ.. యమునా నీటిని తాగారు. అనంతరం, నీటిని నెత్తిన జల్లుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ యుమునా నది నీటిలో విషం కలిపారని హర్యానా బీజేపీ ప్రభుత్వం మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆరోపించారు. యుమునా నదిలోకి కావాలనే పారిశ్రామిక వ్యర్థాలను వదులుతోందన్నారు. ఉద్దేశపూర్వకంగానే పారిశ్రామిక వ్యర్థాలను డంప్‌ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇదే అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ (Atishi) విలేకరులతో మాట్లాడుతూ.. యమునను కలుషితం చేయడం ‘జల ఉగ్రవాదం’ అని అభివర్ణించారు. హర్యానా నుంచి ఢిల్లీకి ప్రవహిస్తున్న యమునా నదిలో అమ్మోనియం స్థాయిలు ఆరు రెట్లు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీ సమీపంలోని పల్లా గ్రామం వద్ధ యమునా నీటిని హర్యానా సీఎం సేవించారు. దీంతో, కేజ్రీవాల్‌ ఆరోపణలకు ఆయన చెక్‌ పెట్టారు.

ఇదిలా ఉండగా.. యమునా నదిపై ఆరోపణలను హర్యానా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కేజ్రీవాల్‌పై హర్యానా ప్రభుత్వం కేసు నమోదు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి విపుల్ గోయల్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘కేజ్రీవాల్‌ మా ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ఆరోపణల వల్ల హర్యానా, ఢిల్లీలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కేజ్రీవాల్‌ నిరాధార ఆరోపణలు చేస్తుంటే మేము చూస్తూ ఊరుకునేది లేదు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటాం. కేజ్రీవాల్‌ మాటలు అవాస్తవమని నిరూపిస్తాం’ అని అన్నారు.

మరోవైపు.. కేజ్రీవాల్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నేడు ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ.. దేశ ప్రధాని తాగే నీళ్లలో హర్యానా ప్రభుత్వం విషం కలుపుతుందా అటూ ప్రజలను సూటిగా ప్రశ్నించారు. హర్యానా ప్రజల బంధువులు ఢిల్లీలో కూడా ఉన్నారని.. తమ సొంత ప్రజలు తాగే నీటిలో ఎవరైనా విషం కలుపుతారా?. ఆ నీటిని తాగే వారిలో ప్రధాని కూడా ఉన్నారన్న సంగతి గుర్తు పెట్టుకోవాలన్నారు. ఎన్నికల్లో ఓడిపోతారనే కారణంగానే ఆప్‌ నేతలు ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)