Breaking News

సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు సెటైర్లు

Published on Sun, 10/20/2024 - 14:37

సాక్షి,కరీంనగర్‌జిల్లా: ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు మరో ఉద్యమం రావాల్సిందేనని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం(అక్టోబర్‌20) తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో జరిగిన అలయ్ బలయ్ సభలో ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు.

‘కాంగ్రెస్‌ వాళ్లు మోసపూరితంగా అధికారం చేజిక్కించుకున్నారు. ఇప్పుడు ప్రజలను గోస పెడుతున్నారు. కరోనా సమయంలోనూ రైతులకు రైతుబంధు పడాలన్న ఆశయంతో నడిచింది కేసీఆర్ ప్రభుత్వం.రూ.10వేలు వద్దు..రూ.15వేలు ఇస్తా అన్న రేవంత్ ఏం చేస్తున్నాడు.రేవంత్ రైతు వ్యతిరేకి. యాసంగికైనా రైతుబంధు కావాలంటే అందరూ సంఘటితం కావాలి.

ఆరు గ్యారెంటీ పథకాలు ఏమయ్యాయి రేవంత్‌. ఫించన్‌లో కూడా దగా చేస్తుండు. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి. చీఫ్ మినిస్టర్ కాదు చీటింగ్ మ్యాన్. బోనస్ ఇస్తా అంటివి..ఏడపోయింది? దేవుడి మీద ఒట్టు పెట్టి రాజకీయం చేసే నాయకుడిని ఇప్పటి వరకు నేను చూడలేదు.

రేవంత్ రెడ్డి చేసిన పాపాలకు ప్రజల్ని కాపాడు అని లక్ష్మినరసింహ స్వామి ఆలయానికి వెళితే నాపై కేసు పెట్టారు. నిరుద్యోగులను దేశ ద్రోహుల్లా చూస్తున్నారు.2లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటివి ఏమయ్యాయి. జీఓ 29 రద్దు చేయడమే గ్రూప్‌ 1 సమస్యకు పరిష్కారం.రాజ్యాంగాన్ని అమలు చేస్తా అన్న రాహుల్ గాంధీ ఏడబోయిండు.?ఎన్నికల ముందు వచ్చిన గాంధీలు ఏడబోయారు’అని హరీశ్‌రావు ప్రశ్నించారు. 

ఇదీ చదవండి: రేవంత్‌ నువ్వు రాహుల్‌ కాంగ్రెస్‌లో లేవా
 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)