Breaking News

‘చాయ్‌ బిస్కట్‌’ సమావేశాలు కాదు: హరీశ్‌రావు ఫైర్‌

Published on Mon, 12/16/2024 - 14:49

సాక్షి,హైదరాబాద్‌:బీఏసీ సమావేశం నుంచి బీఆర్‌ఎస్‌ వాకౌట్‌ చేసింది. అసెంబ్లీని కనీసం 15 రోజుల పాటు నడపాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. ఎన్ని రోజులు సభ నడుపుతారో  క్లారిటీ ఇవ్వకపోవడంతో వాకౌట్‌ చేసినట్లు బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు తెలిపారు. బీఏసీ నుంచి బయటికి వచ్చిన సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదని ఎద్దేవా చేశారు.

‘అసెంబ్లీ సమావేశాలపై ఏమీ తెల్చకపోవడంతో బయటకు వచ్చినం.ఎన్ని రోజులు సభ నడుపుతారో చెప్పక పోవడంతో బీఏసీ నుంచి వాకౌట్ చేశాం. రేపు లగచర్ల అంశంపై చర్చకు బీఅర్ఎస్ పట్టు పట్టింది. ఒక రోజు ప్రభుత్వానికి,మరొక రోజు విపక్షానికి ఇవ్వడం సంప్రదాయం. లగచర్లపైన చర్చకు పట్టుపట్టినం. రైతులకు బేడీలు వేసిన అంశం మాకు చాల కీలకం.కచ్చితంగా ఈ అంశంపైన చర్చకు అవకాశం ఇవ్వాల్సిందే.

బీఏసీకి కేవలం సూచన చేసే అధికారం మాత్రమే ఉందన్న సీఎం వ్యాఖ్యలపైన బీఆర్‌ఎస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. హౌస్ కమీటీ ఏర్పాటుచేయాలి. బీఏసీపైన తమ పార్టీ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలా నిర్ణయం తీసకుంటారని స్పీకర్‌ను అడిగాం. బీఏసీలో లేకుండా సభలో బిల్లులు ప్రవేశపెట్టడంపైన అభ్యంతరం వ్యక్తం చేశాం’అని హరీశ్‌రావు చెప్పారు.

కాగా, సోమవారం అసెంబ్లీలో లగచర్ల రైతులకు బేడీలు వేసిన అంశంపై చర్చించాలని బీఆర్‌ఎస్‌ పట్టుబట్టింది. దీనికి ఒప్పుకోని ప్రభుత్వం టూరిజం పాలసీని చర్చకు పెట్టింది. దీంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగి సభను స్పీకర్‌ మంగళవారానికి వాయిదా వేశారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)