Breaking News

మాట తప్పడమే రేవంత్‌ బ్రాండ్‌

Published on Mon, 04/14/2025 - 01:24

గజ్వేల్‌: ‘యంగ్‌ ఇండియా’పాఠశాలలు తన బ్రాండ్‌ అని ప్రకటించుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డికి ఆ మాట వర్తించదని, మాట తప్పడమే తన బ్రాండ్‌గా ఆయన చెప్పుకోచ్చని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో, బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు.

దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ కేసీఆర్‌ ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.20 లక్షలను ప్రభుత్వం తరఫున ఖర్చు చేసి గురుకుల పాఠశాలలు తీసుకొస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ‘యంగ్‌ ఇండియా’పేరిట పాఠశాలలు తీసుకొస్తూ, ఏటా రూ.1.50 లక్షల ఫీజు, బస్సు ఫీజు చెల్లించాలని సూచిస్తున్నారని విమర్శించారు. చెట్లు నరికితే సామాన్యులపై వాల్టా చట్టాన్ని ప్రయోగించి శిక్షిస్తున్న అధికారులు.. హెచ్‌సీయూ భూముల్లో చెట్లను నరికేసి, నాలుగు జింకల మరణానికి కారణమైన సీఎం రేవంత్‌రెడ్డిపై ఎన్ని కేసులు పెట్టాలో చెప్పాలన్నారు.

400 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల అప్పులు తెచ్చి, బ్రోకర్‌ ఫీజు కింద రూ.170 కోట్ల లంచం చెల్లించారని ఆరోపించారు. చట్టాన్ని ఉల్లంఘించి తప్పులు చేస్తున్న అధికారులు రాబోయే రోజుల్లో జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో వరంగల్‌ బహిరంగ సభకు సంబంధించిన కరపత్రాలను హరీశ్‌ ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)