Breaking News

కేసీఆర్‌ ఎప్పుడూ చెప్తుండేవారు.. మీపై గౌరవం ఉంది: హరీష్‌రావు

Published on Sat, 03/15/2025 - 10:40

హైదరాబాద్‌, సాక్షి: సభలో ఎప్పుడూ హుందాగా ప్రవర్తించాలని తమ పార్టీ అధినేత కేసీఆర్‌(KCR) చెబుతుండేవారని, ఆ మాటను తాము తూచా తప్పకుండా పాటిస్తున్నామని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌ రావు(Harish Rao) అంటున్నారు. శనివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. తమ పార్టీ నేత జగదీష్‌రెడ్డిపై సస్పెన్షన్‌ను ఎ‍త్తివేయాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను కోరారాయన.

‘‘స్పీకర్‌ అంటే జగదీష్‌రెడ్డికి, మాకు ఎంతో గౌరవం ఉంది. సభలో హుందాగా ఉండాలని మా అధినేత చెబుతుండేవారు. మేం అలాగే ఉంటున్నాం. స్పీకర్‌ పట్ల ఆయన అమర్యాదగా ప్రవర్తించలేదు. జగదీష్‌రెడ్డికి మైక్‌ ఇచ్చి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. అయినా ఆయన  స్పీకర్‌ను ఏకవచనంతో పిలవలేదు. కాబట్టి జగదీష్‌రెడ్డి(jagadish Reddy)పై సస్పెన్షన్‌ వేటు ఎత్తేయాలి’’ అని హరీష్‌ రావు స్పీకర్‌ను కోరారు.   

అంతకు ముందు.. సభ ప్రారంభానికి ముందు స్పీకర్‌ను ఆయన ఛాంబర్‌లో బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం కలిసిసింది. జగదీష్‌రెడ్డి సస్పెన్షన్ అక్రమం, అన్యాయన్న బీఆర్‌ఎస్‌ సభ్యులు.. సస్పెన్షన్‌పై ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం కానీ, బీఆర్ఎస్ పార్టీ తరపున వివరణ కానీ, చివరకు సస్పెన్షన్‌కు గురైన సభ్యుడు జగదీశ్ రెడ్డి నుంచి వివరణ కూడా తీసుకోలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. కాబట్టి.. నిర్ణయాన్ని పునఃపరిశీలించి సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు. 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)