Breaking News

దరఖాస్తుల పేరిట సర్కారు దగా

Published on Fri, 02/07/2025 - 05:06

సాక్షి, హైదరాబాద్‌/చిన్నకోడూరు (సిద్దిపేట): అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని పదేపదే చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ .. ప్రజలను ముప్ప తిప్పలు పెడుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. దరఖాస్తుల పేరిట దగా చేయడం మినహా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాదిలో ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. అభయ హస్తం అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ప్రజల పాలిట భస్మాసుర హస్తంగా మారిందని దుయ్యబట్టారు.

ములుగు జిల్లా బుట్టాయిగూడెంలో కుమ్మరి నాగయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై హరీశ్‌రావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదనే ఆవేదనతో ములుగు జిల్లా బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగయ్య గ్రామ సభలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. నాగయ్య ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణం. రోడ్డున పడ్డ నాగయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి’అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. కాగా, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెల్కలపల్లి ప్రజలను భూ నిర్వాసితులుగా గుర్తించి ఆదుకోవాలని నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కు హరీశ్‌రావు గురువారం లేఖ రాశారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)