Breaking News

టీడీపీతో పొత్తు జనసేనకు నష్టం..సీట్లు చెరిసగం ఉండాలి:హరిరామజోగయ్య

Published on Sat, 04/22/2023 - 08:43

సాక్షి, పశ్చిమగోదావరి: గత 14 ఏళ్ల టీడీపీ పాలనలో అవినీతి ఆరోపణలు, కుల ముద్ర, రంగా హత్య ఉదంతం వంటి నీలినీడలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయని కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. టీడీపీకి గత 14 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి పథకాలు, మీడియా మద్దతు, చంద్రబాబు అనుభవం వంటి అంశాలు జనసేనకు లాభించినా.. అవినీతి ఆరోపణలు, రంగా హత్య వంటి ఉదంతాలను ప్రజలు మరచిపోలేదని పేర్కొన్నారు.

బాబుకు వయోభారం, లోకేశ్‌కు అనుభవరాహిత్యం, కాపులకు రిజర్వేషన్లు కల్పించడంలో చిత్తశుద్ధి లోపించడం, బీసీలకు జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌కు స్పందించకపోవడం, ప్రధాని మోదీకి బాబు బద్ధశత్రువు కావడం వల్ల టీడీపీతో జత కలిస్తే జనసేనకు నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేశారు. ఒకవేళ టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే సీట్ల సర్దుబాటులో చెరిసగంగా ఉండాలని తెలిపారు. లేకుంటే అసంతృప్తివాదులు పెరిగి ఓటింగ్‌ సమయంలో ఓట్లు చీలిపోయి మధ్యలో వైఎస్సార్‌సీపీ లబ్ధి పొందుతుందని పేర్కొన్నారు.

టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకొస్తే ముఖ్యమంత్రి పదవి పూర్తికాలం చంద్రబాబుకు కట్టబెడితే.. బాబు వద్ద పవన్‌ ప్యాకేజీ తీసుకున్నాడని, కాపు కులాన్ని టీడీపీకి తాకట్టు పెట్టాడంటూ వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతుందని స్పష్టం చేశారు. అధికారం ఇద్దరూ చెరిసగం తీసుకోవాలని తెలిపారు.
చదవండి: ఎస్‌.. వైనాట్‌ 175.. ఏపీలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)